Bangla Fire : బంగ్లా కంటైనర్ లో ప్రమాదం 25 మంది మృతి
కంటైనర్ డిపోలో ఘటన 450 మందికి గాయాలు
Bangla Fire : బంగ్లాదేశలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది చని పోయారు. 450 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సీతకుంట ప్రాంతంలోని డిపోలో సంభవించింది.
ఇదిలా ఉండగా ఘటనకు సంబంధించి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. బంగ్లా దేశ్(Bangla Fire) లోని చిట్టగాంగ్ లోని షిప్పింగ్ కంటైనర్ డిపోలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఐదు అగ్నిమాపక సిబ్బందితో సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇంకా సంఖ్య పెరిగే చాన్స్ ఉందంటూ వెల్లడించారు బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ హసన్ షహ్రియార్ .
చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పోలీస్ అవుట్ పోస్ట్ లో ఉన్న పోలీస్ అధికారి నూరుల్ ఆలం అంచనా ప్రకారం రసాయన ప్రతిచర్య కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
పేలుడు సంభవించడంతో మంటలు వ్యాపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రాత్రి 9 గంటలకు మంటలు చెలరేగాయని, అర్ధరాత్రి సమయంలో పేలుడు సంభవించిందని పోలీసు ఆఫీసర్ వెల్లడించారు.
పేలుడు అనంతరం మంటలు(Bangla Fire) వేగంగా వ్యాపించాయి. రెడ్ క్రెసెంట్ యూత్ చిట్టగాంగ్ లోని హెల్త్ అండ్ సర్వీస్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇస్తాకుల్ ఇస్లాం మాట్లాడారు.
ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 19 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కంటైనర్ డిపో మే 2011 నుండి పని చేస్తోంది.
Also Read : చమురు దిగుమతులు సబబే – జై శంకర్