Arvind Kejriwal : కాశ్మీర్ ముమ్మాటికీ భారత్ దే – కేజ్రీవాల్
కేంద్ర సర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం ఆగ్రహం
Arvind Kejriwal : జమ్మూ కాశ్మీర్ ముమ్మాటికి భారత దేశంలో భాగమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఏ మాత్రం ముట్టు కోవాలని చూసినా భారతీయులు ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు.
ఇదిలా ఉండగా ఇదే సమయంలో వరుసగా కాశ్మీరీ పండిట్లపై కాల్పులకు తెగబడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. చిల్లర వ్యూహాలను పాక్ ను హెచ్చరించారు.
జంతర్ మంతర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పండిట్ల కు మద్దతుగా , ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటాన్ని నరసిస్తూ ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రసంగించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు. బాధితులు కాశ్మీరీ పండిట్లు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
తమకు రక్షణ కావాలని కోరుతూ నిరసన తెలియ చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు కేజ్రీవాల్.
ప్రభుత్వం ఇలాగే బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తిస్తూ పోతే చివరకు ప్రజలు, బాధితులు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు.
కంట్రోల్ చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు సీఎం. కాశ్మీరీ పండిట్లకు కేంద్రం సమావేశాలు నిర్వహించడం కోరుకోవడం లేదన్నారు.
ప్రధానంగా వారు కోరుతున్నది ఒక్కటే కాల్పులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవడాన్ని కోరుకుంటున్నారన్నారు. 1990 నాటి యుగం మళ్లీ వచ్చింది. మోదీ సర్కార్ కు ఎలాంటి ప్లాన్ లేకుండా పోయిందన్నారు కేజ్రీవాల్.
ప్రధానంగా కాశ్మీరీ పండిట్లు కోరుతున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు.
Also Read : కేంద్ర సర్కార్ పై కేజ్రీవాల్ ఫైర్