Philadelphia Shooting : అమెరికాలో కాల్పులు..ముగ్గురు మృతి
ఫిలడెల్ఫియాలో ఘటన 11 మందికి గాయాలు
Philadelphia Shooting : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్ లో 19 మంది పిల్లలు చనిపోయిన ఘటన మరిచి పోక ముందే ఇంకో ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో 4 నలుగురు మృతి చెందారు. తాజాగా ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల(Philadelphia Shooting) ఘటనలో ముగ్గురు మరణించారు. 11 మంది గాయపడ్డారు. 14 మంది వ్యక్తులు తుపాకీ కాల్పులకు గురయ్యారు.
ఏరియా ఆస్పత్రులకు తరలించారు. వారిలో ముగ్గురు ముగ్గురు చని పోయారు. ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు ప్రకటించారు.
అనేక మంది తుపాకీ గాయాలతో బాధ పడుతున్నారని తెలిపారు పిలిడెల్ఫియా పోలీస్ ఇన్స్ పెక్టర్ డి.ఎఫ్ . పేస్ వెల్లడించారు. 3వ వీధికి సమీపంలోని నగరం సందడిగా ఉన్న సౌత్ స్ట్రీట్ పరిసరాల్లో అర్ధరాత్రికి కొద్ది సేపటి ముందు కాల్పులు జరిగాయి.
తుపాకీ కాల్పుల శబ్దం విన్న పెట్రోలింగ్ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సామూహికంగా కాల్పులకు తెగబడ్డారు. స్పందించిన అధికారి ఒకరు సాయుధులైన ఒకరిపై కాల్పులు జరిపినట్లు ఇన్స్ పెక్టర్ వెల్లడించారు.
సంఘటన స్థలంలో పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో 25 ఏళ్ల మహిళ, 25 ఏళ్ల యువకుడు ఉన్నారు.
మరణించిన వారిలో ఒకరితో సహా ఏడుగురు బాధితులను థామస్ జెఫర్సన్ యూనివర్శిటీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడితో సహా మరో ఐదుగురిని పెన్సిల్వేనియా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
మరో ముగ్గురిని పెన్ ప్రెస్పిటేరియన్ మెడికల్ సెంటర్ కు తరలించారు.
Also Read : బంగ్లా కంటైనర్ లో ప్రమాదం 25 మంది మృతి