Dhananjay Munde : రాబోయే సీఎం పదవి మాదే – ముండే
సంచలన వ్యాఖ్యలు చేసిన ధనంజయ్
Dhananjay Munde : మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ లో భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు ధనంజయ్ ముండే షాకింగ్స్ కామెంట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ , శివసేన,
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి మహా వికాస్ అగాఢిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు.
ఈ తరుణంలో ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే(Dhananjay Munde) తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రస్తుతం శివసేన పార్టీ చీఫ్ బాల్ ఠాక్రే సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటై ఉంది. ఆయన పాలన సాగించి రెండున్నర సంవత్సరాలు అవుతోంది.
ఈ తరుణంలో ధనంజయ్ ముండే తదుపరి మహారాష్ట్ర సీఎంగా తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు ఎన్నిక అవుతారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
మూడు పార్టీల మధ్య ఒక పార్టీకి చెందిన వారు కొంత కాలం పాటు సీఎంగా ఉండేలా ఒప్పందం కుదిరింది. ఈ తరుణంలో ముండే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాంగ్రెస్ , శివసేన పార్టీలలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఔరంగాబాద్ లోని పర్బానీ నగరంలో జరిగిన బహిరంగ సభలో ధనంజయ్ ముండే(Dhananjay Munde) మాట్లాడారు.
శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో సామాజిక న్యాయ విభాగం తన కృషి వల్ల ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పారు.
సామాజిక న్యాయ శాఖను ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్న రేపు తలెత్తితే కాబోయే సీఎం కూడా మాదేనని పేర్కొన్నారు.
Also Read : నూపుర్ శర్మకు షాక్ బీజేపీ నుంచి ఔట్