Deepak Mittal : ఆ కామెంట్స్ తో సంబంధం లేదు
ఖతార్ సర్కార్ కు రాయబారి వివరణ
Deepak Mittal : ఇస్లాం ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ యూపీ స్పోక్స్ పర్సన్ నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఈ కామెంట్స్ పై యూపీలో ఆందోళన వ్యక్తమైంది.
కాన్పూర్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై మరొకరు చేసుకున్న దాడుల్లో ఏకంగా 40 మంది గాయపడ్డారు. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
దీంతో పార్టీకి తీరని డ్యామేజ్ జరుగుతుందని భావించిన బీజేపీ హైకమాండ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నూపుర్ శర్మ కామెంట్స్ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
పార్టీ రూల్స్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి ని కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి ఖతార్ లో భారత రాయబారి దీపక్ మిట్టల్(Deepak Mittal) ఈ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆ దేశానికి వివరించే ప్రయత్నం చేశారు.
వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, ఇందులో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
భారత దేశం నాగరికత, వారసత్వం భిన్నత్వంలో ఏకత్వం అనే బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటుందని స్పష్టం చేశారు.
అన్ని మతాలకు సమాన , అత్యున్నత గౌరవాన్ని ఇస్తోందని తెలిపారు. కించ పరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
Also Read : మూవీస్ ప్రమోషన్స్ లో బీజేపీ బిజీ – రౌత్