Sidhu Murder Case : సిద్దూ వాలా కేసులో మరొకరు అరెస్ట్
మూడో నిందితుడు పోలీసు అదుపులో
Sidhu Murder Case : పంజాబ్ సింగర్ సిద్దూ మూసే వాలా హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సిద్దూ పేరెంట్స్ కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాలని కోరారు. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.
తాజాగా సిద్దూ(Sidhu Murder Case) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా హత్య కేసులో హర్యానాలోని ఫతేహాబాద్ లో పట్టుకున్నారు. మూడో నిందితుడు దేవేంద్ర అలియాస్ కాలా. గత కొన్ని రోజుల కిందట పంజాబ్ గాయకుడిని మాన్సా జిల్లాలో కాల్చి చంపారు.
కాలాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సిద్దూను కాల్చిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరాఖండ్ లో ఒకరిని పట్టుకున్నారు.
ఇప్పటి అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు దేవేంద్ర అలియాస్ కాలాను పట్టుకున్నారు.
గత నెల మే 16, 17 తేదీలలో కాలా తన ఇంట్లో కేశవ్ , చరణ్ జీత్ అనే ఇద్దరు అనుమానిత హత్యలకు వసతి కల్పించినట్లు పోలీసులకు ఇన్ పుట్ లు అందాయి.
ఇంతకు ముందు సిద్దూ మూసే వాలా(Sidhu Murder Case) హత్యలో భిర్దానాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పవర్ , నసీబ్ ని అరెస్ట్ చేశారు.
తాజాగా ఫతేహాబాద్ జిల్లా నుండి ఈ కేసుకు సంబంధించి కాలాతో కలిపి మూడో అరెస్ట్ . ఇక సిద్దూ హత్య వెనుక తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నారంటూ అనుమానిస్తున్నారు.
అతడి సపోర్ట్ తో కెనెడా నుంచి ఆపరేట్ చేస్తున్న గ్యాంగ్ దీనిలో పాల్గొన్నదని భావిస్తున్నారు.
Also Read : అంతర్యుద్దం దిశగా భారతదేశం – లాలూ