VK Sasikala : రాజకీయంగా ఎద‌గ‌కుండా డీఎంకే అడ్డుపుల్ల‌

బ‌హిష్కృత నేత వీకే శ‌శిక‌ళ షాకింగ్ కామెంట్స్

VK Sasikala : అన్నాడీఎం బ‌హిష్కృత నాయ‌కురాలు వీకే శ‌శిక‌ళ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న ఎదుగుద‌ల‌ను డీఎంకే అడ్డుకుంటోందంటూ ఆరోపించారు. తాను ఏఐఏడీఎంకేతో క‌ల‌వ‌డం డీఎంకేకు ఇష్టం లేద‌ని పేర్కొన్నారు.

తాను వేరుగా ఉండాల‌ని వారు కోరుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. తాను 38 ఏళ్లుగా రాజకీయాల‌లో ఉన్నానని, ఎన్నో క‌ష్టాలు అధిగ‌మించి ఈ స్థితికి వ‌చ్చాన‌ని చెప్పారు.

దేనిని ఎప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుస‌న్నారు. డీఎంకే హ‌యాంలో త‌మిళ‌నాడులో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. జ‌నం చెవుల్లో పూలు పెట్ట‌డం త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో చేసింది ఏమీ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు శ‌శిక‌ళ‌(VK Sasikala) .

త‌న పార్టీతో తాను క‌ల‌వ‌డాన్ని డీఎంకే కోరుకోవ‌డం లేద‌న్నారు. ఇరు పార్టీలు వేర్వేరు అయినప్ప‌టికీ డీఎంకే మ‌నుషులు కూడా అన్నాడీఎంకేలో ఉన్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఆల్ ఇండియా అన్నా ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గంలో ఒకానొక స‌మ‌యంలో చ‌క్రం తిప్పారు వీకే శ‌శిక‌ళ‌. కుమారి జ‌య‌ల‌లిత సీఎంగా ఉన్న స‌మ‌యంలో వీకే శ‌శిక‌ళ(VK Sasikala)  రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వ్య‌వ‌హ‌రించారు.

అవినీతి ఆరోప‌ణ‌లపై ఆమె నాలుగు సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష అనుభ‌వించారు. అనంత‌రం అన్నాడీఎంకే పార్టీ త‌న‌దేనంటూ ప్ర‌క‌టించారు.

తీరా ఆమెకు త‌మ పార్టీతో సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు ప‌న్నీర్ సెల్వం, ఎడా పాడి ప‌ళ‌ని స్వామి. త‌మిళ‌నాడులోని విల్లుపురం జిల్లా తిండివ‌న్ లో జ‌రిగిన ఓ వివాహ వేడుక‌లో వీకే శ‌శిక‌ళ మీడియాతో మాట్లాడారు.

అన్నాడీఎంకే పార్టీ జెండాను ఉప‌యోగించ వ‌ద్ద‌నే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని స్ప‌ష్టం చేశారు వీకే శ‌శిక‌ళ‌. అలా చేస్తున్న వారు డీఎంకే పార్టీతో సంబంధం క‌లిగి ఉన్న వారేన‌ని ఆరోపించారు.

Also Read : సిద్దూ వాలా కేసులో మ‌రొక‌రు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!