Lawrence Bishnoi : లేఖపై బిష్ణోయ్ ని ప్రశ్నించిన పోలీసులు
సల్మాన్ ఖాన్, తండ్రి సలీం కు బెదిరింపు లేఖ
Lawrence Bishnoi : దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లో నిలిచారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. తనను , తన తండ్రి సలీమ్ ను చంపుతామంటూ బెదిరింపు లేఖ వచ్చిందంటూ సల్మాన్ ఖాన్ ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఈ లేఖ కు సంబంధించి తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) ను పోలీసులు ప్రశ్నించారు.
గత నెలలో మాన్సా జిల్లాలలో దారుణంగా హత్యకు గురైన సింగర్ సిద్దూ మూసే వాలాకు పట్టిన గతే నీకు పడుతుందంటూ సల్మాన్ ఖాన్ ను హెచ్చరించారు ఆ లేఖలో. ఆ లేఖలో చంపుతామని పేర్కొన్నారు.
పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు కూడా. సల్మాన్ ఖాన్ , తండ్రి సలీం ఖాన్ పేర్లు ఉన్నాయి. ఈ లేఖను సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విడిచి వెళ్లారు.
ఇదిలా ఉండగా సిద్దూ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్. విచిత్రం ఏమిటంటే ఈ లేఖలో రెండు అక్షరాలు మాత్రమే రాసి ఉన్నాయి.
వాటిలో ఒకటి జీబీ అని రెండోది ఎల్బీ అని. అంటే అర్థం జీబీ అంటే గోల్డీ బ్రార్ అని ఎల్పీ అంటే లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) అని అర్థం వచ్చేలా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ మేరకు గ్యాంగ్ స్టర్ ను ప్రశ్నించారు. కాగా ఈ లేఖను పంపింది వారేనా లేక వారి పేర్లను ఉపయోగించి ఎవరైనా పంపించారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
బెదిరింపు లేఖ బహిర్గతం కావడం, సల్మాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయనకు, కుటుంబానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read : సిద్దూ హత్య కేసులో 8 మంది గుర్తింపు