Nupur Sharma : ప్రాణ‌హాని ఉంద‌న్న నూపుర్ శ‌ర్మ

ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు

Nupur Sharma : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు బీజేపీకి చెందిన అధికార ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ప్ర‌వక్త వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో త‌న‌ను చంపుతామ‌ని, బెదిరింపుల‌కు గురి చేస్తున్నారంటూ నూపుర్ శ‌ర్మ(Nupur Sharma) వాపోయింది.

ఈ మేర‌కు సోమవారం ఆమె ఢిల్లీ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీంతో కేసు న‌మోదు చేశారు. నూపుర్ శ‌ర్మ కామెంట్స్ పై గ‌ల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త ఎదురైంది. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది.

ఆమె వ్య‌క్తిగ‌త కామెంట్స్ త‌ప్ప భార‌త స‌ర్కార్ ఎలాంటి మ‌ద్ద‌తు ఇవ్వ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు త‌మ దేశంలో అన్ని వ‌ర్గాలు, కులాల వారిని స‌మానంగా చూస్తామ‌ని , త‌మ దృష్టిలో మ‌నుషులంతా ఒక్క‌టేన‌ని పేర్కొంది.

ఇదే విష‌యాన్ని అన్ని ఇస్లామిక్, అర‌బ్, గ‌ల్ఫ్ కంట్రీస్ కు స్ప‌ష్టం చేసింది. ఈ త‌రుణంలో ఢిల్లీకి చెందిన నూపుర్ శ‌ర్మ‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఆమె చేసిన కామెంట్స్ దెబ్బ‌కు యూపీలోని కాన్పూర్ లో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో 40 మంది గాయ‌ప‌డ్డారు.

వారిలో 13 మంది పోలీసులు కూడా ఉన్నారు. ప‌రిస్థితి మ‌రింత తీవ్రం కాకుండా ఉండేందుకు పార్టీ హైక‌మాండ్ నూపుర్ శ‌ర్మ‌(Nupur Sharma) ను స‌స్పెండ్ చేసింది.

ఒక టీవీ చ‌ర్చ‌లో భాగంగా నూపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వీటిపై పెద్ద రాద్దాంతం చెల‌రేగింది. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె కోరింది.

Also Read : ఎవ‌రీ నూపుర్ శ‌ర్మ ఏమిటా క‌థ

Leave A Reply

Your Email Id will not be published!