Arindam Bagchi : పాక్ పీఎం కామెంట్స్ భార‌త్ సీరియ‌స్

మీ దేశంలో మైనార్టీల ప‌రిస్థితి ఏంటో చెప్పండి

Arindam Bagchi : ప్ర‌వ‌క్త మ‌హ‌మ్మ‌ద్ పై బీజేపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్‌. ఆయ‌న భార‌త్ ను త‌ప్పు ప‌ట్టారు ట్విట్ట‌ర్ వేదిక‌గా. దీనిపై స్పందించింది భార‌త దేశం.

తాము పాకిస్తాన్ నుంచి చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు గ‌మ‌నించాం. మైనార్టీ హ‌క్కుల‌ను ఎవ‌రు కాపాడుతున్నారో ఏ దేశంలో మైనార్టీలు దాడుల‌కు పాల్ప‌డుతున్నారో యావ‌త్ ప్ర‌పంచానికి తెలుస‌ని పేర్కొన్నారు విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి(Arindam Bagchi).

త‌మ దేశంలో మైనార్టీల‌కు పూర్తి ర‌క్ష‌ణ ఉంద‌న్నారు. మీ దేశంలో బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదంటూ పాకిస్తాన్ పీఎంపై విరుచుకు ప‌డ్డారు. తాము ఎవ‌రి ప‌ట్ల వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించ‌మ‌ని పేర్కొన్నారు.

ప్ర‌ధానంగా పాకిస్తాన్ లో హిందువులు, సిక్కులు, క్రైస్త‌వులు, అహ్మ‌దీయుల‌తో స‌హా మైనార్టీల‌ను పాకిస్తాన్ వ్య‌వ‌స్థాగ‌తంగా హింసిస్తోందంటూ బాగ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మ‌న ప్రియత‌మై దైవం ప్ర‌వ‌క్త‌ను బీజేపీ నాయ‌కులు కామెంట్స్ చేయ‌డాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పీఎం ష‌రీఫ్ పేర్కొనడాన్ని త‌ప్పు ప‌ట్టారు అరింద‌మ్ బాగ్చి(Arindam Bagchi).

మోదీ నేతృత్వంలోని భార‌త దేశం మ‌త స్వేచ్ఛ‌ను తుంగ‌లో తొక్కుతోంద‌ని ఆరోపించారు. ముస్లింల‌ను ప‌దే ప‌దే హింసిస్తోందంటూ పేర్కొన్నారు. ప‌విత్ర‌మైన ప్ర‌వ‌క్త ప్రేమ కోసం మ‌న‌మంతా జీవితాల‌ను త్యాగం చేయాల‌ని పిలుపునిచ్చారు.

దీనిపై తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బాగ్చి. భార‌త ప్ర‌భుత్వం అన్ని మ‌తాల‌కు స‌మాన గౌర‌వం ఇస్తుంద‌న్నారు. మ‌తోన్మాదుల‌ను కీర్తించ‌డం, వారి కోసం స్మార‌క క‌ట్ట‌డాల‌ను నిర్మించే పాకిస్తాన్ కు త‌మ‌ను అనే హ‌క్కు లేద‌న్నారు.

Also Read : అమెరికాలో కాల్పులు..ముగ్గురు మృతి

Leave A Reply

Your Email Id will not be published!