Rahul Gandhi : దేశం పరువు తీసిన మతోన్మాదం – రాహుల్
కేంద్ర సర్కార్ కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్
Rahul Gandhi : భారతీయ జనతా పార్టీ తొలగించ బడిన నూపుర్ శర్మ, నవీజ్ జిందాల్ చేసిన కామెంట్స్ దెబ్బకు భారత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం , ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది బీజేపీ హై కమాండ్. మీడియా ఇన్ చార్జితో పాటు పార్టీ స్పోక్స్ పర్సన్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
కానీ మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ కు భారత ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఆయా దేశాలు భారత దేశానికి చెందిన రాయబారులను పిలిపించి అభ్యంతరం తెలిపాయి.
దీనిపై కేంద్రం రంగంలోకి దిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో మతోన్మాదం ఎంత ప్రమాదకరమైనదో ఇప్పుడు తెలిసి వచ్చినట్లుంది మోదీ ప్రభుత్వానికి అంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. సిగ్గు మాలిన మతోన్మాదం దెబ్బకు ఇప్పుడు ప్రపంచంలో భారత్ ఒంటరిగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు.
ఈ స్థితిని తనకు తానుగా తెచ్చుకున్నదని ఇది ఎంత మాత్రం దేశానికి మంచిది కాదని సూచించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). అంతర్గతంగా చీలి పోయిన దేశం బాహ్య పరంగా మరింత బలహీనంగా మారిందన్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఘాటుగా ట్వీట్ చేశారు. అవమానకరమైన మతోన్మాదం తమను ఒంటరిని చేయడమే కాకంఉడా ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను దెబ్బ తీసిందని ఆరోపించారు.
Also Read : వాళ్లను ప్రేరేపించింది ఎవరో తేల్చండి