KTR : రాజకీయాలను ప్రాతపదికగా తీసుకుని, కక్ష సాధింపు ధోరణితో కేంద్రం వ్యవహరిస్తే మిగిలేది ఏమీ ఉండదన్నారు మంత్రి కేటీఆర్. ఆయా రాష్ట్రాలు ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే అన్నింటిని పక్కన పెట్టి సహకరించాలని కోరారు.
ఇది సమాఖ్య భావనకు మేలు చేకూరుస్తుందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం మరింత శక్తివంతంగా తయారవుతుందని చెప్పారు. కేంద్రం మంచి చేస్తే ప్రశంసించేందుకు సిద్దంగా ఉంటాం.
కానీ ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించ బోమంటూ హెచ్చరించారు కేటీఆర్. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలని , ఆ తర్వాత ప్రగతి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలన్నారు.
తాజాగా తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను మంత్రి ఆవిష్కరించారు. ఒక్క టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
ఇప్పటి దాకా 16.48 లక్షల మందికి వీటి ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అంతే కాకుండా వీధి వ్యాపారులకు సంబంధించి వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఫోకస్ పెట్టామన్నారు.
రాష్ట్రాన్ని ఆదర్శ వంతంగా , పెట్టుబడులకు స్వర్గ ధామంగా మార్చేలా చేస్తున్నామని చెప్పారు కేటీఆర్(KTR). ఒక వేళ పరిశ్రమలకు గనుక పర్మిషన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా జరిమానా విధించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కేంద్రంపై మండిపడ్డారు కేటీఆర్(KTR). ఇప్పటి వరకు ఆరు పారిశ్రామిక కారిడార్ లకు ప్రతిపాదనలు పంపించినా పర్మిషన్ రాలేదన్నారు.
Also Read : దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి – కేటీఆర్