RBI Gandhi : క‌రెన్సీ నోట్ల‌పై గాంధీ బొమ్మ మార్చం

స్ప‌ష్టం చేసిన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

RBI Gandhi : దేశంలో రెండో సారి మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు, అనుకోని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. నోట్ల ర‌ద్దు త‌ర్వాత కేంద్రం ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌న్న ఆందోళ‌న దేశ ప్ర‌జ‌ల్లో నెల‌కొంది.

ఇప్ప‌టికే గ‌తంలో కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో పెట్టిన పేర్ల‌ను మార్చేందుకు రెడీ అయ్యింది. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ ఖేల్ ర‌త్న‌ను మార్చేసింది. దానిని హాకీ వీరుడు ధ్యాన్ చంద్ పేరుతో పుర‌స్కారాలు అంద‌జేస్తోంది.

తాజాగా భార‌త బ్యాంకుల‌కే కాదు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్ను ద‌న్నుగా నిలిచే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే నోట్ల‌పై ఉన్న జాతిపిత మ‌హాత్మా గాంధీ(RBI Gandhi) చిత్రాన్ని మార్చుతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదే విష‌యాన్ని జాతీయ మీడియా కోడై కూసింది. దీంతో రంగంలోకి దిగింది ఆర్బీఐ(RBI Gandhi). వివ‌ర‌ణ ఇచ్చు కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో వెంట‌నే సోమ‌వారం అధికారికంగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

ప్ర‌స్తుతం భార‌త దేశంలో జారీ చేసే క‌రెన్సీ నోట్ల‌పై బాపు బొమ్మ అలాగే ఉంటుంద‌ని, దానిని మార్చే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని పేర్కొంది.

కాగా గాంధీ స్థానంలో విశ్వ క‌విగా పేరొందిన ర‌వీంద్ర నాథ్ ఠాగోర్ తో పాటు మాజీ రాష్ట్ర ప‌తి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా విఖ్యాతి చెందిన ఏపీజే అబ్దుల్ క‌లాం ఫోటోను ముద్రించ‌నున్న‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

వీటిని పూర్తిగా తోసి పుచ్చింది ఆర్బీఐ. మ‌హాత్ముడే నోట్ల‌పై త‌ప్ప‌నిస‌రిగా ఉంటాడ‌ని వెల్ల‌డించింది.

Also Read : మాతృ భాష భేష్ హిందీ భాష వేస్ట్

Leave A Reply

Your Email Id will not be published!