JP Nadda : ఏపీలో కాషాయ జెండా ఎగరాలి
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
JP Nadda : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షాకింగ్ కామెంట్స్ చేశారు. పొత్తు గురించి తర్వాత ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీల గురించి ఆలోచించడం మానేయండి.
ముందు మనం బలంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు బీజేపీ చీఫ్. రెండు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడలో జేపీ నడ్డా(JP Nadda) రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని కోరారు. సమర్థవంతమైన నాయకుడిగా పేరొందిన నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ దేశ వ్యాప్తంగా బలంగా ఉందని, కానీ ఏపీలో ఇంకా బలపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఎప్పుడో వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే పొత్తుల గురించి చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు జేపీ నడ్డా.
ఏపీలో కాషాయ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. స్వయం శక్తితో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు బీజేపీ చీఫ్. కొన్ని పార్టీలు కావాలని మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాయని వాటి వలలో పడవద్దంటూ సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని చెప్పారు జేపీ నడ్డా(JP Nadda). కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని బీజేపీ చీఫ్ సోము వీర్రాజును ఆదేశించారు.
జూలై నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తారని, ఆ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టాలన్నారు.
Also Read : కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ మార్చం