India Damage : కామెంట్స్ క‌ల‌క‌లం ముస్లిం దేశాల ఆగ్ర‌హం

ప్ర‌వ‌క్త‌పై కామెంట్స్ వ్య‌వ‌హారం

India Damage : భార‌తీయ జ‌న‌తా పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ నూపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. చివ‌ర‌కు పార్టీ ఆమెతో పాటు ఢిల్లీ మీడియా ఇన్ చార్జి న‌వీన్ జిందాల్ ను స‌స్పెండ్ చేసింది.

కానీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి పోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ముస్లింలు, ప్ర‌వ‌క్త ను దైవంగా భావించే వారు, అర‌బ్ దేశాలు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాయి. ప్ర‌స్తుతం ఈ కామెంట్స్ భార‌త దేశాన్ని ఇరుకున పెట్టాయి.

దీనిపై అన్ని ముస్లిం, అర‌బ్, గ‌ల్ఫ్ దేశాల‌కు మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇక ముస్లిం కంట్రీస్ నిప్పులు చెరుగుతున్నాయి.

తాజాగా 15 దేశాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి భార‌త్ పై. ఇదిలా ఉండ‌గా తాము అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తామ‌ని, ప్ర‌వ‌క్త‌ను అవ‌మానించ‌డాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్.

భార‌త్ పై ఇరాన్ , ఇరాక్ , కువైట్ , సౌదీ అరేబియా, ఒమ‌న్ , యూఏఈ, జోర్డాన్ , ఆఫ్గ‌నిస్తాన్ , బ‌హ్రెయిన్ , మాల్దీవులు, లిబియా, ఇండోనేషియా , త‌దిత‌ర దేశాలు నిప్పులు చెరిగాయి.

భార‌త ప్ర‌భుత్వం బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్(India Damage) చేశాయి. ఇక స్వ‌దేశంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు బీజేపీ నాయ‌కుల‌పై చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఒత్తిడి పెంచాయి.

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్ ప‌రువుకు భంగం క‌లిగించేలా చేశారంటూ ఆరోపించాయి. ఇదిలా ఉండ‌గా ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆప‌రేష‌న్ (ఓఐసీ) ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించింది.

భార‌త దేశంలో మైనార్టీల హ‌క్కుల‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది.

Also Read : ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కే ఆధార్

Leave A Reply

Your Email Id will not be published!