Pooja Shakun Pandey : సాధ్వి అన్నపూర్ణపై కేసు నమోదు
మత పరమైన కామెంట్స్ కలకలం
Pooja Shakun Pandey : ఇప్పటికే భారత ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది తమ పార్టీకి చెందిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్స్ దెబ్బకు. మహమ్మద్ ప్రవక్తపై నోరు పారేసు కోవడంతో యావత్ ప్రపంచంలోని ముస్లిం వర్గాలు, మతాలు, దేశాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.
ఈ తరుణంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మత పరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను యూపీలో కేసు నమోదైంది. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినందుకు గాను సాధ్వి అన్నపూర్ణ అలియాస్ పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) పై అలీఘర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ మేరకు ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వివాదాస్పద ప్రకటనకు సంబంధించి అఖిల భారత హిందూ మహా సభ (ఏబీహెచ్ఎం) జాతీయ కార్యదర్శగా ఉన్నారు ఆమె.
వివాదాస్పద ప్రకటనకు సంబంధించి పూజా శకున్ పాండే పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) కేసు నమోదైంది. ఆమెపై ఐపీసీ సెక్షన్ 153A/153B/295A/298/505 కింద పోలీస్ స్టేషన్ గాంధీ పార్క్ లో కేసు నమోదైంది.
ఈ విషయాన్ని అలీఘర్ పోలీస్ సూపరింటెండెంట్ కళానిధి నైతాని వెల్లడించారు. శ్రీమతి పాండే , మరికొందరు హిందూ మత పెద్దలపై ఉత్తరాఖండ్ పోలీసులు గత ఏడాది హరిద్వార్ ధరం సన్సద్ (మత సభ) లో ద్వేష పూరిత ప్రసంగానికి పాల్పడ్డారు.
ఈ ఏడాది ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ద్వేష పూరిత ప్రసంగం కేసు నమోదు చేశారు. ముస్లింలపై హింసకు బహింరగ పిలుపులతో సహా ద్వేష పూరిత ప్రసంగాలు జరిగాయి.
Also Read : పంజాబ్ మాజీ మంత్రి ధరమ్ సోత్ అరెస్ట్