PM Modi : రూపాయి పవర్ ఏంటో చూపించాలి – మోదీ
ప్రపంచ వాణిజ్యంతో మన కరెన్సీ కీలకం
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ రూపాయి దమ్ము ఏంటో చూపించాలని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ , సరఫరా వ్యవస్థలో మన బ్యాంకులను, కరెన్సీని కీలకంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్థిక, కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను మెరుగు పర్చు కోవాలని సూచించారు. ప్రధానంగా మన రూపాయి బలోపేతం అయ్యేలా, వరల్డ్ వైడ్ గా ప్రభావితం చేసేలా తయారు చేయాలని స్పష్టం చేశారు మోదీ.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నిర్వహణలో వారోత్సాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడారు.
13 రకాల ప్రభుత్వ రుణాల పథకాలకు సంబంధించిన వివారలను అందించే జన్ సమర్థ్ పోర్టల్ ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
విద్యార్థులు, రైతులు, వ్యాపారవేత్తలు, చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలకు రుణాలు కల్పించేందుకు, అడ్డంకులు లేకుండా త్వరగా మంజూరు చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగ పడుతుందన్నారు మోదీ.
దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి ఆర్థిక సర్వీసులు అందించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కానీ వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్నారు మోదీ.
ఈ సందర్భంగా ప్రత్యేక సీరీస్ కలిగిన నాణేలను ఆవిష్కరించారు ప్రధాని. రూ.1, 2, 5, 10 , 20 డినామినేషన్లలో ఉన్నాయి. ఇవి యథా ప్రకారం చెలామణిలో ఉంటాయని చెప్పారు.
దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించేందుకు ఈ కొత్త సీరీస్ నాణేలు పనికి వస్తాయన్న ఆశా భావాన్ని దేశ ప్రధాన మంత్రి మోదీ(PM Modi) వ్యక్తం చేశారు.
Also Read : సాధ్వి అన్నపూర్ణపై కేసు నమోదు