UNO India : పరమత సహనం అవసరం – యుఎన్
ముస్లిం దేశాల ఆరోపణపై స్పందన
UNO India : అన్ని మతాలను గౌరవించేలా పరమత సహనం పాటించాలని ఐక్య రాజ్య సమితి(UNO India) స్పష్టం చేసింది. భారత దేశంపై ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం, అరబ్, గల్ఫ్ దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి.
భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై నోరు పారేసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి.
సౌదీలో ఏకంగా భారత దేశం తయారు చేసిన వస్తువులపై నిషేధం విధించారు. పలు దేశాలలో భారత దేశ రాయబారులను పిలిపించి మాట్లాడుతున్నాయి. తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
భారత్ కు డ్యామేజ్ ఏర్పడనుందని గుర్తించిన బీజేపీ హై కమాండ్ రంగంలోకి దిగింది. నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదే సమయంలో భారత దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సీరియస్ గా ఖండించారు.
తమ విధానం ఎవరినీ నొప్పించదన్నారు. భారత దేశం అన్ని వర్గాలు, మతాల వారి పట్ల ప్రత్యేకించి మైనార్టీల పట్ల మెతక వైఖరిని అవలంభిస్తుందన్నారు. ఎవరినీ టార్గెట్ చేయదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో పాకిస్తాన్ పీఎంకు కోలుకోలేని రీతిలో కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా ఇస్లామిక్ దేశాల సంస్థ ఏకంగా ఐక్య రాజ్య సమితి(UNO India) కి ఓ లేఖ రాసింది. భారత దేశంలో మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరింది.
దీనిపై యూఎన్ఓ స్పందించింది. అన్ని మతాలను గౌరవించేలా ఇండియా ప్రయత్నించాలని, పరమత సహనం ఒక్కటే అందరినీ ఒక చోటుకు చేరుస్తుందని తెలిపింది.
Also Read : అవిశ్వాస పరీక్షలో నెగ్గిన బోరిసన్ జాన్సన్