Kerala Governor : కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ షాకింగ్ కామెంట్స్

క‌మాప‌ణ చెప్పాల‌న‌డం స‌రి కాదు

Kerala Governor : కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌వ‌క్త వ్యాఖ్య‌ల‌పై భార‌త్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఖ‌తార్ తో పాటు ముస్లిం దేశాలు డిమాండ్ చేయడాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

ఢిల్లీలో గ‌వ‌ర్న‌ర్(Kerala Governor) ఖాన్ మాట్లాడారు. కాశ్మీర్ తో పాటు ఇత‌ర విష‌యాల‌పై చాలా సంవ‌త్స‌రాలుగా భార‌త్ కు వ్య‌తిరేకంగా ఈ దేశాలు ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

అదేమంత ముఖ్య‌మైన అంశం కాద‌ని కొట్టి పారేశారు. ఈ సంద‌ర్భంగా భార‌త దేశం త‌న సంప్ర‌దాయాల‌ను కాపాడు కోవ‌డంలో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

దీనిని లైట్ గా తీసుకోవాల‌న్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ దేశంలో అంద‌రినీ క‌లుపుకుని పోయేలా బ‌లోపేతం చేయాల‌ని పిలుపునిచ్చారు. కొన్నేళ్లుగా ఈ కంట్రీస్ భార‌త్ ప‌ట్ల ద్వేష పూరితంగా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు.

అవి చేస్తున్న డిమాండ్లు ఆమోద యోగ్యం కాద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయ‌లు చెప్పేందుకు ఇక్క‌డ హ‌క్కు అనేది ఉంద‌న్న విష‌యం గ్ర‌హించాలి. ఎవ‌రి అభిప్రాయాలు వారివి. ఇందు కోసం క్ష‌మాప‌ణ కోర‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు.

ఇటువంటి చిన్న ప్ర‌తి చ‌ర్య‌ల గురించి భార‌త దేశం ఎప్పుడూ బాధ ప‌డ‌ద‌ని స్ప‌ష్టం చేశారు కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ మ‌హ్మ‌ద్ ఆరిఫ్ ఖాన్.
భార‌త దేశం ముందు నుంచీ అన్ని మ‌తాల‌ను, వ‌ర్గాల‌ను, కులాల‌ను స‌మానంగా చూస్తూ వ‌స్తోంద‌న్నారు.

ఇది గ‌మ‌నించ‌కుండా ఒక‌రిద్ద‌రు చేసిన కామెంట్స్ కు దేశం ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న ఎదురు ప్ర‌శ్న వేశారు. భార‌త దేశ సంస్కృతి ఎవ‌రినీ ఇత‌రులుగా ప‌రిగ‌ణించ‌ద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Also Read : సాధ్వి అన్న‌పూర్ణ‌పై కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!