Elon Musk Twitter : డాటా ఇస్తేనే డీల్ లేదంటే రద్దు
ట్విట్టర్ కు తేల్చి చెప్పిన ఎలోన్ మస్క్
Elon Musk Twitter : ట్విట్టర్ పై కన్నేసిన టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్ కొనుగోలు చేసేందుకు నానా మెలికలు పెడుతున్నారు. ఆయన ప్రధానంగా ట్విట్టర్ పనితీరును తప్పు పట్టారు. అంతే కాకుండా ప్రవాస భారతీయుడైన సిఇఓ పరాగ్ అగర్వాల్ పై నిప్పులు చెరిగారు.
ఇదే సమయంలో ట్విట్టర్ కు సంబంధించి లా విభాగం చూస్తున్న చీఫ్ పై అనుచిత కామెంట్స్ చేశాడు. భారీ ఎత్తున డీల్ ఓకే చేసుకున్నట్లు ప్రకటించిన ఎలోన్ మస్క్ ఆ తర్వాత సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తున్నారు.
ఇదే సమయంలో ట్వీట్లు చేస్తూ మరింత గందరగోళానికి నెట్టాడు. ఇదిలా ఉండగా స్పామ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయనే దానిపై తనకు క్లారిటీ ఇవ్వాలని షరతు పెట్టాడు. దీనికి సంబంధించి పరాగ్ అగర్వాల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కాన ఎలోన్ మస్క్(Elon Musk Twitter) తనకు పూర్తిగా డాటా ఇస్తేనే తాను డీల్ కుదుర్చుకుంటానని స్పష్టం చేశాడు. లేదంటే తాను ట్విట్టర్ తో డీల్ రద్దు చేసుకుంటానంటూ హెచ్చరించాడు. ప్రస్తుతం మస్క్ చేసిన ఈ ట్వీట్ కలకలం రేపింది.
అంతకు ముందు ట్విట్టర్ మేనేజ్ మెంట్ కు సుదీర్ఘ లేఖ రాశాడు ఈ మెయిల్ ద్వారా. తాను పెట్టిన కండీషన్స్ ను సంతృప్తి పర్చగలిగితేనే తాను డీల్ కుదుర్చుకునేందుకు ముందడుగు వేస్తానని ప్రకటించాడు.
దీంతో మరో ట్విస్ట్ ఏర్పడింది. ఇప్పటికే ట్విట్టర్ లో పని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కాగా మస్క్ డీల్ గడువు ముగిసిందంటూ గత వారంతంలో ట్విట్టర్(Elon Musk Twitter) ప్రకటించింది.
కాగా ఒప్పంద భాగస్వామిగా ట్విట్టర్ బాధ్యతల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని ఆరోపించాడు మస్క్.
Also Read : గూగుల్ ఆపిల్ నువ్వా నేనా