Navneet Rana : ఎంపీ న‌వ‌నీత్ రాణా అరెస్ట్ పై స‌మ‌న్లు

జారీ చేసిన హౌస్ ప్యానెల్

Navneet Rana : మ‌హారాష్ట్ర ఉన్న‌తాధికారుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. మ‌రాఠా లోని అమ‌రావ‌తి లోక్ స‌భ ఎంపీ న‌వ‌నీత్ రాణా అరెస్ట్ పై హౌస్ ప్యానెల్ స‌మ‌న్లు జారీ చేసింది.

సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే నివాసం వెలుప‌ల హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఎంపీ న‌వ‌నీత్ రాణా. ఆమె భ‌ర్త‌ను గ‌త ఏప్రిల్ నెల‌లో అరెస్ట్ చేశారు.

కాగా వీరు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో గ‌త నెల‌లో బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ న‌వ‌నీత్ రాణా(Navneet Rana)  హ‌క్కుల ఉల్లంఘ‌న ఫిర్యాదుపై జూన్ 15న త‌మ ముందు హాజ‌రు కావాల‌ని లోక్ స‌భ పార్ల‌మెంట‌రీ ప్రివిలేజ్ క‌మిటీ మ‌హారాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ, రాష్ట్ర డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ , ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ల‌కు స‌మ‌న్లు జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా త‌న హ‌క్కుల‌కు భంగం క‌లిగించేలా ఉన్నతాధికారులు వ్య‌వ‌హరించారంటూ ఎంపీ న‌వ‌నీత్ రాణా(Navneet Rana)  లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు ఆమె చేసిన ఫిర్యాదుపై విచార‌ణ‌కు ఆదేశించారు.

ఇందులో భాగంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ సునీల్ సింగ్ నేతృత్వంలోని క‌మిటీ వ‌చ్చే వారం విచార‌ణ చేప‌ట్టనుంది. క‌మిటీ మ‌రాఠాకు చెందిన ప‌లువురు అధికారుల‌ను పిలిపించింది ఇప్ప‌టికే.

అధికార ఉల్లంఘ‌నకు పాల్ప‌డ్డారంటూ పార్ల‌మెంట‌రీ ప్ర‌విలేజెస్ అండ్ ఎథిక్స్ క‌మిటీకి లేఖ రాశారు. ఖార్ పోలీస్ స్టేష‌న్ లో త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌ని , అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆరోపించారు ఎంపీ న‌వ‌నీత్ రాణా.

Also Read : సిద్దూ కుటుంబానికి రాహుల్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!