BJP vs Shiv Sena : రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ ఎమ్మెల్యేలే కీల‌కం

6వ సీటు కోసం బీజేపీ, శివ‌సేన హోరా హోరీ

BJP vs Shiv Sena : మ‌రాఠాలో రాజ్య‌స‌భ ఎంపీ స్థానాల‌కు సంబంధించి ఎన్నిక‌లు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ, శివ‌సేన పార్టీల(BJP vs Shiv Sena) మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఈనెల 10న మ‌హారాష్ట్ర‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓటింగ్ జ‌ర‌గ‌నుంది.

రాష్ట్ర అసెంబ్లీలో 13 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చిన్నా చిత‌క పార్టీల‌కు చెందిన వారున్నారు. 22 ఏళ్ల త‌ర్వాత రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాజ్య‌స‌భ ఆరో సీటును కైవ‌సం చేసుకునేందుకు బీజేపీ, శివ‌సేన(BJP vs Shiv Sena) పావులు క‌దుపుతున్నాయి. ఈ త‌రుణంలో ఫ‌లితాల్లో కీల‌క పాత్ర పోషించే స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు ప‌న్నుతున్నాయి.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తే మీ మీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధుల‌ను మంజూరు చేస్తామ‌ని హామీ ఇస్తోంది.

ఇంకో వైపు మౌలిక స‌దుపాయాల అభివృద్దికి సంబంధించి మీ మీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు నేరుగా ఇస్తామ‌ని హామీ ఇస్తోంది కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మీ జోలికి రాకుండా చూసుకుంటామ‌ని హామీ కూడా ఇస్తోంది. అందుబాటులో ఉన్న ఆరు స్థానాల‌కు మొత్తం 7 మంది అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్లు వేశారు.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే అభ్య‌ర్థికి 42 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం . బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివ‌సేన‌కు 55, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ మూడు పార్టీలు క‌లిసి ఇప్పుడు మ‌హా వికాస్ అఘాడీ పేరుతో స‌ర్కార్ ఏర్పాటు చేశారు. 151 సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల‌తో పాటు ఇండిపెండెట్లు క‌లిపి 29 మంది ఉన్నారు. ప్ర‌స్తుతం జ‌రిగే ఎన్నిక‌ల్లో వీరే కీల‌కం కానున్నారు.

Also Read : ఎంపీ న‌వ‌నీత్ రాణా అరెస్ట్ పై స‌మ‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!