King Donald : యూఎస్ స్కూల్స్ ల‌లో కింగ్ డొనాల్డ్ పుస్త‌కం

ఉండాల‌ని కోరుకుంటున్న మాజీ ప్రెసిడెంట్

King Donald : అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని ప్ర‌తి పాఠ‌శాల‌లో త‌న ఆధారంగా ది ప్లాట్ ఎగైనెస్ట్ ది కింగ్ అనే పిల్ల‌ల పుస్త‌కం ఉండాల‌ని కోరుకుంటున్నారు.

ఉదార‌వాద పేరెంట్స్ అభ్యంత‌ర‌క‌రంగా భావించే పుస్త‌కాన్ని మిస్ట‌ర్ ట్రంప్ పెంట‌గాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ప‌ని చేసిన కాష్ ప‌టేల్ రాశారు. కింగ్ డోనాల్డ్(King Donald) డిఫెండింగ్ పిల్ల‌ల పుస్త‌కాన్ని ట్రంప్ కోరుకున్నారు.

ఏప్రిల్ లో బ్రేవ్ బుక్స్ సంప్ర‌దాయ వాద ప్ర‌చుర‌ణ సంస్థ పుస్త‌కాన్ని విడుద‌ల చేసింది. అద్భుత క‌థ‌గా దీనిని రూపొందించ‌డంలో స‌క్సెస్ అయ్యారు ప‌టేల్. ఈ పుస్త‌కంలో ట్రంప్ పై హిల్ల‌రీస్ భయంక‌ర‌మైన కుట్ర గురించి కూడా ఇందులో వివ‌రించారు.

ఈ అద్బుత‌మైన పుస్త‌కాన్ని అమెరికాలోని ప్ర‌తి పాఠ‌శాల‌లో ఉంచుదామ‌ని ఈ మాజీ ప్రెసిడెంట్ గ‌త వారం తన సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోష‌ల్ లో పోస్ట్ చేశారు.

ప్ర‌చుర‌ణ సంస్థ ఈ ప‌నిని అద్భుత క‌థ‌, వాస్త‌వంగా అందించింద‌ని స్ప‌ష్టం చేసింది. ఇది భ‌యంక‌ర‌మైన నిజ‌మైన క‌థ అద్భుత‌మైన రీటెల్లింగ్ అని పేర్కొంది.

మ‌న దేశం లో సంభ‌వించిన అతి పెద్ద అన్యాయాల‌లో ఒక దానిని వెలికి తీసే కీల‌క క‌థ‌. పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాడు కాష్ ప‌టేల్. భ‌యంక‌ర‌మైన ప‌న్నాగం ఎలా జ‌రిగింద‌నే దానిని అర్థం అయ్యేలా చెప్పారు.

పుస్త‌కం ప్రాథ‌మికంగా స్టీల్ డోసియ‌ర్ క‌థ‌నం చుట్టూ తిరుగుతుంది. ట్రంప్(King Donald) ప్ర‌చారానికి ర‌ష్యా చీఫ్ పుతిన్ సాయం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై తిరుగుతుంది ఈ క‌థ‌.

ఈ అద్భుత‌మైన పుస్త‌కాన్ని ప్ర‌తి బ‌డిలో పెట్టాల‌ని త‌న అనుచ‌రుల‌ను ప్రోత్స‌హించాడు మాజీ ప్రెసిడెంట్.

Also Read : ప‌ర‌మ‌త స‌హ‌నం అవ‌స‌రం – యుఎన్

Leave A Reply

Your Email Id will not be published!