Supreme Court : డాక్ట‌ర్ల భ‌విష్య‌త్తుతో ఆట‌లాడొద్దు – సుప్రీం

కేంద్ర స‌ర్కార్ పై సుప్రీంకోర్టు ఫైర్

Supreme Court : కేంద్ర స‌ర్కార్ పై సీరియ‌స్ అయ్యింది సుప్రీంకోర్టు. డాక్ట‌ర్ల భ‌విష్య‌త్తుతో ఆట‌లాడు కోవ‌ద్దంటూ మండిప‌డింది. భ‌ర్తీ చేసిన నీట్ – పీజీ సీట్ల‌పై కేంద్రం ఎందుకు తాత్సారం వ‌హిస్తోందంటూ ప్ర‌శ్నించింది.

దేశంలో వైద్య నిపుణుల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ ఈ ఏడాది 1,450 పోస్ట్ గ్రాడ్యూయేట్ మెడిక‌ల్ సీట్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయ‌ని కేంద్రాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) బుధ‌వారం ప్ర‌శ్నించింది.

ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఖాళీగా ఉండ‌డం దేనికి నిద‌ర్శ‌న‌మ‌ని నిల‌దీసింది. మీరు వైద్యుల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది కోర్టు ధ‌ర్మాస‌నం.

అద‌న‌పు మాప్ అప్ కౌన్సెలింగ్ రౌండ్ నిర్వ‌హించడం ద్వారా ఈ సీట్ల‌ను ఎందుకు భ‌ర్తీ చేయ‌లేదో వివ‌రిస్తూ రోజు వ్య‌వ‌ధిలో కేంద్రం, మెడిక‌ల్ కౌన్సెలింగ్ క‌మిటీ (ఎంసీసీ) ద్వారా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

వైద్యుల జీవితాల‌తో, భ‌విష్య‌త్తుతో ఆడుకున్నందుకు వారికి న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని కేంద్రాన్ని కోర‌డాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చ‌ని సుప్రీంకోర్టు(Supreme Court) హెచ్చ‌రించింది.

ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు ఎం.ఆర్. షా , అనిరుద్ద బోస్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ డాక్ట‌ర్ల సీట్ల మిగులుపై విచార‌ణ చేప‌ట్టింది. ఒక్క సీటు ఖాళీగా ఉన్నా దానిని భ‌ర్తీ చేయాల్సిందే. వృధా కాకూడ‌ద‌ని హెచ్చ‌రించింది.

విద్యార్థుల‌కు అడ్మిష‌న్లు ఇవ్వ‌క పోతే న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వ‌స్తుంద‌ని స్పష్టం చేసింది.

నీట్ – పీజీ 2021 -22 కి సంబంధించిన చివ‌రి మాప్ కౌన్సెలింగ్ రౌండ్ మే 7న ముగిసిన త‌ర్వాత ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల కోసం ప్ర‌త్యేకంగా కౌన్సెలింగ్ చేప‌ట్టాల‌ని కోరుతూ ఏడుగురు వైద్యులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Also Read : గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లో ఎన్ హెచ్ 53

Leave A Reply

Your Email Id will not be published!