YS Jagan : సంక్షేమ పథకాల అమలులో ఏపీ టాప్
87 శాతం కుటుంబాలకు పథకాలు
YS Jagan : దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 87 శాతానికి పైగా ప్రజలకు మేలు చేకూరిందన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో వర్క్ షాప్ చేపట్టారు.
రాష్ట్రానికి చెందిన మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల ప్రెసిడెంట్లు హాజరయ్యారు. వర్క్ షాప్ ను ప్రారంభించి ప్రసంగించారు సీఎం. గడప గడపకూ అనేది నిరంతరం జరిగే కార్యక్రమమని స్పష్టం చేశారు.
8 నెలల పాటు కొనసాగుతుందన్నారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులు కేటాయిస్తామన్నారు. నెలలో 20 రోజుల పాటు 10 సచివాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నాం.
ఇంకా మెరుగ్గా ఎలా చేయాలనే దానిపై చర్చించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెలా వర్క్ షాపు చేపట్టనున్నట్లు ప్రకటించారు సీఎం(YS Jagan). ఆ నెలలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు.
మరింత మెరుగ్గా చేపట్టేందుకు ఫోకస్ పెడతామన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు సీఎం. ప్రజల నుంచి వినతులు అత్యంత ముఖ్యమైనవని గుర్తు చేశారు సీఎం.
గతంలో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు సాధించాం. ఈసారి 175కి 175 సాధించాలని పిలుపునిచ్చారు జగన్ రెడ్డి(YS Jagan). ఏపీ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించాం. ప్రతి పథకం అన్ని వర్గాల వారికి చేరేలా చేశామన్నారు సీఎం.
Also Read : డాక్టర్ల భవిష్యత్తుతో ఆటలాడొద్దు – సుప్రీం