Mahmood Ali : చైర్మన్ తొలగింపు నా చేతుల్లో లేదు
హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
Mahmood Ali : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు. ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జాతీయ మీడియా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరో వైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
కేసుకు సంబంధించి తనకు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలను ఆదేశించింది.
మొదట ఈ కేసులో ప్రధానంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ(Mahmood Ali) మనుమడి పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ ఘటనకు సంబంధిచిన కేసులో హోం మంత్రి మనుమడి ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.
దీనిపై బుధవారం స్పందించారు హోం మంత్రి. తన మనవడిపై అనవసర ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు నిందితులు అరెస్ట్ కావడంతో తన మనవడిపై ఉన్న ఆరోపణలు తప్పని లేదని చెప్పారు.
ఇదిలా ఉండగా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని తొలగించే అధికారం తన చేతుల్లో ఉండదన్నారు. అది కేవలం రాష్ట్ర వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందన్నారు.
సెల్ ఫోన్లు ఉండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, పేరెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చట్ట పరిధిలో పోలీసులు తమ పని తాము చేసుకుంటారని అన్నారు మహమూద్ అలీ.
Also Read : రేప్ లకు అడ్డాగా మారిన హైదరాబాద్