India Slams : ప‌ర్యావ‌ర‌ణ ఇండెక్స్ పై కేంద్రం ఫైర్

స‌ర్వే అంతా అశాస్త్రీయ‌మంటూ ఆగ్ర‌హం

India Slams : ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా జాబితా విడుద‌లైంది. 180 దేశాల జాబితాలో భార‌త్(India Slams) స్థానం మ‌రింత దిగ‌జారింది. దిగువ‌న ఉన్న ప‌ర్యావ‌ర‌ణ ప‌నితీరు సూచిక 2022ను కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ బుధ‌వారం తిప్పి కొట్టింది.

ఇది ఉప‌యోగించిన కొన్ని సూచిక‌లు అవాస్త‌వాల‌కు ద‌గ్గ‌ర‌గా, ఊహాగానాల‌తో నిండి ఉన్నాయ‌ని పేర్కొంది. యేల్ సెంట‌ర్ ఫ‌ర్ ఎన్విరాన్ మెంటల్ లా అండ్ పాల‌సీ , సెంట‌ర్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ నెట్ వ‌ర్క్ , కొలంబియా యూనివర్శిటీ సంయుక్తంగా క‌లిసి ప్ర‌చురించాయి జాబితాను.

వాతావ‌ర‌ణ మార్పుల ప‌నితీరు, ప‌ర్యావ‌ర‌ణ ఆరోగ్యం, ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ , జీవ‌శ‌క్తి త‌దిత‌ర అంశాల‌ను ప్రామాణికంగా తీసుకుని దేశాల‌ను అంచ‌నా వేశాయి. 11 విభాగాల‌లో 40 ప‌నితీరు సూచిక‌ల‌ను ఉప‌యోగించింది.

దీని గురించి సీరియ‌స్ గా స్పందించింది కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌. ఇది పూర్తిగా అబ‌ద్దాల‌తో, అవాస్త‌వాల‌తో, అశాస్త్రీయంగా సాగించిన ప‌రిశోధ‌న త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొంది.

ఉద్గార ప‌థంపై చారిత్ర‌క డేటా ను విస్మ‌రించారంటూ ఆరోపించింది. భార‌త్(India Slams) ప‌ర్యావ‌ర‌ణం కోసం ఎంత‌గానో కృషి చేస్తోంద‌ని కానీ వాటినేవి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదంటూ మండిప‌డింది.

అంతే కాకుండా నీటి నాణ్య‌త‌, నీటి వినియోగ సామ‌ర్థ్యం , స్థిర‌మైన వినియోగం , ఉత్ప‌త్తికి ద‌గ్గ‌రి సంబంధం ఉన్న త‌ల‌స‌రి వ్య‌ర్థాల ఉత్ప‌త్తికి సంబంధించిన సూచిక‌ల‌ను ఇండెక్స్ లో చేర్చ‌లేదంటూ సీరియ‌స్ అయ్యింది.

వ్య‌వసాయ జీవ వైవిధ్యం, నేల ఆరోగ్యం, ఆహార న‌ష్టం, వ్య‌ర్థాలు వంటి సూచిక‌ల‌ను ఈ ఇండెక్స్ లో చేర్చ‌లేద‌ని ఆరోపించింది. భార‌త దేశం అన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డింద‌ని దానిని గుర్తించ లేద‌ని మండిప‌డింది.

Also Read : స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!