Rishabh Pant : టీమిండియా టీ20 కెప్టెన్ గా రిషబ్ పంత్
సఫారీ టీ20 సీరీస్ కు రాహుల్ దూరం
Rishabh Pant : భారత జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈనెల 9 నుంచి సౌతాఫ్రికాతో టీ20 సీరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టీమిండియా 5 మ్యాచ్ లు ఆడనుంది. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ.
ఈ తరుణంలో గాయం కారణంగా కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ తప్పుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా తో ఆడే జట్టుకు రిషబ్ పంత్(Rishabh Pant) నాయకత్వం వహిస్తాడు. గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది.
ఇదిలా ఉండగా స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకున్నట్లు జాతీయ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పంత్ స్థానంలో వైస్ కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉండగా నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు భారత ఆటగాళ్లు. శిక్షణ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు.
ఐపీఎల్ లో నాయకత్వ పరంగా హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ గొప్పగా రాణించారని ప్రశంసించాడు. ఈ తరుణంలో హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇస్తారా అన్నది వేచి చూడాలి.
ఇది అనుకోని పరిణామం. తుది జట్టులో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ఉమ్రాన్ మాలిక్ ను కూడా జాబితాలో ఉంటాడని అనుకుంటున్నారు.
కాగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవూమా సంచలన కామెంట్స్ చేశాడు. తమకు పేసర్లను ఆడడం కొత్త కాదని, అదో సరదా అని పేర్కొన్నాడు. మాలిక్ లాంటి వాళ్లను చాలా ఎదుర్కొన్నామని చెప్పాడు.
Also Read : క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై