IND vs SA 1St T20 : సఫారీతో యుద్దానికి భారత్ రెడీ
ఢిల్లీలో మొదటి టి20 మ్యాచ్ కు సిద్దం
IND vs SA 1St T20 : ఐదు మ్యాచ్ ల టి20 సీరీస్ గురువారం నుంచే మొదలవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో తెంబా బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా(IND vs SA 1St T20) జట్టుతో రిషబ్ పంత్ నేతృత్వంలోని భారత జట్టు ఆడనుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది. దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది.
కేఎల్ రాహుల్ కు పగ్గాలు అప్పగించింది. కాగా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్ తో పాటు కుల్దీప్ సింగ్ గాయపడ్డారు.
దీంతో సఫారీ సీరీస్ కు దూరమయ్యారు. దాంతో బీసీసీఐ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను సంప్రదించి ఢిల్లీకి చెందిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
ఈసారి జట్టులో ఐపీఎల్ 2022లో అద్భుతమైన ప్రదర్శన చేపట్టిన ఆటగాళ్లకు చాన్స్ ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్స్ -1లో
ప్రసారం కానున్న ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా జరగనుంది.
ఇరు జట్లు అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను బలంగా ఉన్నాయి. కాక పోతే ఊహించని రీతిలో చాలా కాలం తర్వాత ముంబైకి చెందిన
హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ మళ్లీ జట్టులోకి రావడం విశేషం.
ఈ సీరీస్ లో కుర్రాళ్లకు చాన్స్ ఎక్కువగా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది బీసీసీఐ. ఇదే ఏడాదిలో ఆసిస్ వేదికగా టీ20 వరల్డ్ కప్(IND vs SA 1St T20) జరగనుంది. స్టార్ ఆటగాళ్లు దూరం కావడం ఒక రకంగా టీమిండియాకు ఇబ్బందే.
రుతురాజ్ , ఇషాన్ కిషన్ , దీపక్ హూడా, హర్షల్ పటేల్ , అవేష్ ఖాన్ , రవి బిష్ణోయ్ , ఇమ్రాన్ మాలిక్ , హార్దిక్ పాండ్యా, చాహల్ , పంత్ కీలకంగా మారనున్నారు.
ఇక సఫారీ జట్టులో ఆరితేరిన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లలో డికాక్ , మిల్లర్ రబడ, నోర్జే దుమ్ము లేపారు ఐపీఎల్ లో.
Also Read : టీమిండియా టీ20 కెప్టెన్ గా రిషబ్ పంత్