Mithali Raj : కెప్టెన్ గా మిథాలీ రాజ్ అరుదైన ఘనత
భారత జట్టుకు భారీ విజయాలు
Mithali Raj : భారత మహిళా క్రికెట్ లో ఒక శకం ముగిసింది. సుదీర్ఘ కాలం పాటు తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్న అద్భుతమైన క్రికెటర్ హైదరాబాదీ మిథాలీ రాజ్ ఇక సెలవంటూ ప్రకటించింది.
యావత్ క్రీడా లోకం విస్తు పోయింది. అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆటతోనే కాదు అందంతో కట్టి పడేసిన ఈ స్పెషల్ విమెన్ క్రికెటర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
పదే పదే మిథాలీ రాజ్ గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే క్రికెట్ అంటేనే పురుష క్రికెటర్లు గుర్తుకు వస్తారు. వారందరి ప్రభావాన్ని
తట్టుకుని నిలబడింది.
తనను తాను ప్రూవ్ చేసుకుని ఏకంగా భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించే జట్టుకు నాయకురాలిగా ఎదిగింది. ఇది మామూలు విషయం కాదు.
ఎలాంటి ఆదరణ లేని తరుణంలో దానికంటూ ఓ ప్రత్యేకతను తీసుకు వచ్చేలా చేసిన ఘనత మాత్రం మిథాలీ రాజ్(Mithali Raj). ఏకంగా మహిళల క్రికెట్ లో ఆల్ టైట్ గ్రేట్ బ్యాటర్ గా పేరు తనపై లిఖించుకుంది.
భరత నాట్యాన్ని వదులుకుంది. డబ్బులకు ఇబ్బంది పడినా తను కావాలనుకున్న క్రికెట్ ను మాత్రం వదల్లేదు. దానినే శ్వాసగా జీవితంగా మార్చుకుంది మిథాలీ రాజ్.
తన కెరీర్ లో మూడు ఫార్మాట్ లు కలిపి 10 వేలకు పైగా పరుగులు ఉన్నాయి. ఇది కూడా ఓ రికార్డే. ఆమె ఎదుగుదల వెనుక పేరెంట్స్ దొరై రాజ్, లీలా రాజ్ ఉన్నారు.
1999లో వన్డే కెరీర్ ను స్టార్ట్ చేసింది. సెంచరీ చేసి ఔరా అనిపించింది. 2002లో టెస్టులో ఆడింది. రెండు టెస్టుల్లో నిరాశ పరిచినా మూడో టెస్టులో
డబుల్ సెంచరీతో సత్తా చాటింది.
23 ఏళ్ల పాటు ఏకధాటిగా ఆడింది. 2005లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ చేరి రన్నరప్ గా నిలిచింది.
ఆమె సారథ్యంలో ఎన్నో మధురమైన విజయాలు సాధించింది జట్టు. ద్వైపాక్షిక సీరీస్ లు, ఆసియా కప్ లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు
దేశాల టోర్నీలు ఉండడం విశేషం.
Also Read : ఎన్నో రికార్డులు మరెన్నో అవార్డులు