Shai Hope : పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు షాకిచ్చిన షాయ్

హోప్ మార‌థాన్ ఇన్నింగ్స్ భేష్

Shai Hope : పాకిస్తాన్ తో ముల్తాన్ లో జ‌రిగిన మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో భారీ స్కోర్లు న‌మోద‌య్యాయి. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్నాడు విండీస్ కెప్టెన్ నికోల‌స్ పూర‌న్. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 305 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

పాకిస్తాన్ కెప్టెన్ మార‌థాన్ ఇన్నింగ్స్ మెర‌వ‌డం, ఇత‌ర ఆట‌గాళ్లు రాణించ‌డంతో ఆ జ‌ట్టు 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది విండీస్ యంగ్ క్రికెట‌ర్ షాయ్ హోప్(Shai Hope) .

పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఓ వైపు త‌న స‌హ‌చ‌రులు వికెట్లు పారేసుకున్నా త‌ను మాత్రం దుమ్ము రేపాడు. భారీ స్కోర్ పెరిగేలా చేశాడు. కీల‌క‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఏకంగా 127 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. ఓపెన‌ర్ బ్రూక్స్ తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. పాకిస్తాన్ పై భారీ స్కోర్ న‌మ‌దు చేసింది విండీస్. ఆట ప్రారంభంలోనే ఓపెన‌ర్ కెల్లీ మేయ‌ర్స్ ను కోల్పోయింది.

ఆ స‌మ‌యంలో జ‌ట్టు స్కోర్ 9 ప‌రుగులు మాత్ర‌మే. మేయ‌ర్స్ త‌ర్వాత బ‌రిలోకి దిగిన షాయ్ హోప్(Shai Hope) ఇన్నింగ్స్ ను ఒంటి చేత్తో న‌డిపించాడు. 134 బంతులు ఎదుర్కొన్న షాయ్ 127 ర‌న్స్ చేశాడు.

ఇందులో 15 ఫోర్లు ఓ భారీ సిక్స్ కొట్టాడు. హోప్ బ్రూక్స్ క‌లిసి 154 ర‌న్స్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ త‌రుణంలో 70 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు .

83 బంతులు ఆడి 7 ఫోర్ల‌తో ఈ స్కోర్ చేశాడు. మొత్తంగా షాయ్ కొట్టిన దెబ్బ‌కు పాక్ బౌల‌ర్లు ఇబ్బంది ప‌డ్డారు.

Also Read : వెస్టిండీస్ పై పాకిస్తాన్ గ్రాండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!