Assam Cabinet Expansion : అస్సాం కేబినెట్ విస్తరణ
ప్రకటంచిన సీఎం బిశ్వ శర్మ
Assam Cabinet Expansion : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. జయంత మల్లా బారువా, నందితా గర్లోసాలతో గురువారం గవర్నర్ జగదీష్ ముఖి ప్రమాణ స్వీకారం చేయించారు.
గత ఏడాది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అనంతరం అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మొదటిసారిగా తన కేబినెట్(Assam Cabinet Expansion) ను విస్తరించారు.
ఆయన తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఇదే కాకుండా కొంత మంది మంత్రుల శాఖలను పునర్ వ్యవస్థీకరించారు.
కాగా తాజాగా కొత్తగా ఇద్దరు మంత్రులు కేబినెట్(Assam Cabinet Expansion) లో కొలువు తీరడంతో మంత్రివర్గ బలం 16కి చేరింది. భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రులు 13 మంది ఉన్నారు.
ఇక పార్టీతో కొనసాగుతున్న మిత్రపక్షాలు అసోం గణ పరిషత్ పార్టీకి చెందిన ఇద్దరు, యునైటెడ్ పీపుల్స్ పార్టీకి చెందిన ఒకరు మంత్రి వర్గంలో కొలువు తీరారు.
ఇదిలా ఉండగా 40 ఏళ్ల బారువా 2015లో సీఎం హిమంత బిస్వా శర్మతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అస్సాం టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా ఉన్నాడు.
మంత్రిగా ఎదగడానికి ముందు సీఎం కు రాజకీయ కార్యదర్శిగా పని చేశాడు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బారువా మాట్లాడారు.
కొత్త బాధ్యత అప్పగించినందుకు సీఎం బిస్వా శర్మకు ధన్యవాదాలు. నా శక్తి మేరకు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. బారువాకు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ , టూరిజం, నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపక విభాగాలు కేటాయించారు.
మరో మంత్రి 45 ఏళ్ల గార్లోసాకు ఎంఏ చదివారు. ఆంమెకు శక్తి, గనులు, ఖనిజాలు, సహకారం, దేశీయ, గిరిజన, సాంస్కృతిక శాఖ కేటాయించారు సీఎం.
Also Read : ఢిల్లీ పోలీసులపై ఓవైసీ ఫైర్