President Election : రాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ
ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం
President Election : భారత దేశ అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి పదవి కి ఎన్నికల(President Election) నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
జూలై 18న పోలింగ్ 21న ఓటింగ్ లెక్కింపు ఉంటుంది. పార్లమెంట్ ప్రాంగణంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో ఎన్నికలకు సంబంధించి ఓట్లు వేస్తారు.
ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే అర్హులు. ఎమ్మెల్సీలకు అవకాశం ఉండదు. పోటీ మాత్రం హోరా హోరీగా కొనసాగనుంది. విపక్షాలు గనుక కలిసికట్టుగా కృషి చేస్తే విజయం సాధించేందుకు వీలుంటుంది.
ఇక బీజేపీ అభ్యర్థి గెలవాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 4,809 ఓటర్లుగా పాల్గొంటారు.
776 మంది ఎంపీల ఓటు విలువ 5,43,200 కాగా 4,033 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 5,43,231 గా ఉంది. వీటి మొత్తం వాల్యూ 10, 86, 431 గా ఉంది.
ఎన్డీయే కి అంటే భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు 5,35,00 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థుల మొత్తం ఓటు విలువ 5,51,431 గా ఉంది.
బీజేపీ కంటే విపక్షాల శాతమే ఎక్కువగా ఉంది. క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప గెలిచే చాన్స్ లేదు బీజేపీ అభ్యర్థికి. రాజస్తాన్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ , జార్ఖండ్ , తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్డీయే పవర్ లో లేదు.
దీంతో వైసీపీ, బీజేడీలో ఏ ఒక్క పార్టీ మద్దతు ఇచ్చినా ప్రెసిడెంట్(President Election) గెలుపు సాధ్యమవుతుంది.
Also Read : రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్