MIM Shiv Sena : శివ‌సేన కూట‌మికి ఎంఐఎం స‌పోర్ట్

మ‌రాఠా రాజ‌కీయాల్లో ఊహించ‌ని ట్విస్ట్

MIM Shiv Sena : మ‌హారాష్ట్ర రాజ‌కీయ‌ల‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివ‌సేన‌(MIM Shiv Sena), కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల‌న్నీ క‌లిసి మ‌హా వికాస్ అఘాడిగా ఏర్ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం సంకీర్ణ స‌ర్కార్ నెల‌కొని ఉంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ, శివ‌సేన పార్టీల‌కు మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ త‌న ప‌వ‌ర్ ను ఉప‌యోగించి బీజేపీయేత‌ర రాష్ట్రాలు, పార్టీలు, నాయ‌కులు, సంస్థ‌లు, కంపెనీల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది.

ఇప్ప‌టికే మ‌హా వికాస్ అఘాడి సంకీర్ణ స‌ర్కార్ లో కీల‌క మంత్రులుగా ఉన్న అనిల్ దేశ్ ముఖ్ , న‌వాబ్ మాలిక్ ను అరెస్ట్ చేయించింది. దీంతో మ‌రింత ఉద్రిక్త‌త నెల‌కొంది ఇరు పార్టీల మ‌ధ్య‌.

ఈ త‌రుణంలో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు రావ‌డంతో త‌మ బలాల్ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 15 రాష్ట్రాల‌లో 57 రాజ్య‌స‌భ ఎంపీ సీట్ల‌కు గాను 41 సీట్లు ఏక‌గ్రీవం అయ్యాయి.

ఇక మిగిలిన 16 సీట్ల‌కు గాను ఎన్నిక‌లు ఈనెల 10న శుక్ర‌వారం జ‌రుగుతున్నాయి. ఇక నిన్న‌టి దాకా కారాలు మిరియాలు నూరుతూ వ‌చ్చిన ఎంఐఎం, శివ‌సేన(MIM Shiv Sena) పార్టీలు ఇప్పుడు ఒక్క‌టి కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురి చేసింది.

బీజేపీకి వ్య‌తిరేకంగా మ‌రాఠాలో ఎంఐఎం కాంగ్రెస్ అభ్య‌ర్థులకు స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జ‌లీల్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం స్థానాల‌లో 6 స్థానాలు ఒక్క మ‌హారాష్ట్ర లోనే ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఇమ్రాన్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.

Also Read : ఢిల్లీ పోలీసులపై ఓవైసీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!