Sidhu Moose Wala : సిద్దూ హత్య కేసులో షూటర్ అరెస్ట్
ఇప్పటి వరకు తొమ్మిది మంది అదుపులో
Sidhu Moose Wala : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు సిద్దూ మూసే వాలా హత్య కేసు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు.
ఆప్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో మాన్సా జిల్లాలో గుర్తు తెలియని దుండుగులు జరిపిన కాల్పుల్లో చని పోయాడు. రాష్ట్రంలో ఆప్ సర్కార్ ప్రముఖులకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆ మరుసటి రోజే దారుణ హత్యకు గురయయాడు సింగర్ సిద్దూ(Sidhu Moose Wala). రెండు ముఠాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే ఈ ఘటనకు కారణమని పంజాబ్ పోలీస్ చీఫ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం భగవంత్ మాన్. జ్యూడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించారు. ఇదే సమయంలో హర్యానా, పంజాబ్ కోర్టు సెక్యూరిటీ ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే దానిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చింది.
ఆ వెంటనే ఉప సంహరించుకున్న సెక్యూరిటీని తిరిగి ప్రముఖులకు కల్పిస్తున్నట్లు ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం. ఇదిలా ఉండగా సిద్దూ హత్య కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు పోలీసులు.
ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరొక షూటర్ ను అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లయింది.
కాగా ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు పోలీసులు.
ఇదిలా ఉండగా హత్యకు బాధ్యత వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై ఇంటర్ పోల్ గురువారం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
Also Read : అవినీతి సహించను అక్రమాలు ప్రోత్సహించను