Tamilisai Soundara Rajan : మ‌హిళా ద‌ర్బార్ కొన‌సాగుతుంది

న‌న్ను ఆపే శ‌క్తి ఎవ‌రికీ లేదన్న గ‌వ‌ర్న‌ర్

Tamilisai Soundara Rajan : తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజన్ ఆధ్వ‌ర్యంలో రాజ్ భ‌వ‌న్ లో శుక్ర‌వారం మ‌హిళా ద‌ర్బార్ కొన‌సాగింది. ఈ కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున మ‌హిళ‌లు, బాధితులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్నా. ప్ర‌జ‌ల ప‌క్షాన బ‌ల‌మైన శ‌క్తిగా ఉంటాన‌ని పేర్కొన్నారు. కొంద‌రు నా గురించి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు.

అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వాటిని నేను ప‌ట్టించుకోను. ఇవాళ రాష్ట్రంలో ఘోర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, యువ‌తులు, బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలు చూస్తే త‌ట్టుకోలేక పోతున్నాను.

జూబ్లీ హిల్స్ అమ్నీషియా ప‌బ్ మైన‌ర్ బాలిక గ్యాంగ్ రేప్ కు సంబంధించిన ఘ‌ట‌న‌కు సంబంధించి నివేదిక‌ను 2 రోజుల్లో ఇవ్వాల‌ని ఆదేశించాను. ఈరోజు వ‌ర‌కు ఎలాంటి రిపోర్టు ఇవ్వ‌లేద‌ని సీరియ‌స్ అయ్యారు.

తెలంగాణ ప్ర‌భుత్వం నా విష‌యంలో ప్ర‌ధానంగా ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని ఆరోపించారు త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్. దీనిపై నేను కాదు స్పందించాల్సింది కేసీఆర్ స‌ర్కార్ స్పందించాల‌ని నిప్పులు చెరిగారు.

నా కోసం పోరాటం చేయ‌డం లేదు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్నా. ఇందులో ఎలాంటి త‌ప్పు లేద‌న్నారు. మ‌హిళ‌ల త‌ర‌పున వారికి అండ‌గా ఉండాల్సిన బాధ్య‌త నాపై ఉంద‌న్నారు గ‌వ‌ర్న‌ర్.

రాజ్ భ‌వ‌న్ నుంచి వ‌చ్చే విన‌తుల్ని అధికారులు ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళా ద‌ర్బార్ ఇంత‌టితో ఆగ‌ద‌ని అది నిరంత‌రం కొన‌సాగుతూ ఉంటుంద‌ని చెప్పారు త‌మిళి సై సౌంద‌ర రాజన్(Tamilisai Soundara Rajan) .

Also Read : రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ‘రాజులు’ ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!