JDS MLA Goud : కాంగ్రెస్ ఓటేసిన జేడీఎస్ ఎమ్మెల్యే
ఆ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం
JDS MLA Goud : దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో 16 సీట్లకు సంబంధించి రాజ్యసభ ఎంపీ స్థానాల కోసం ఓటింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల క్రాస్
ఓటింగ్ కొనసాగింది.
తాజాగా కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్(JDS MLA Goud) దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆయన తన విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు.
ఆయన హెచ్ డి కుమార స్వామి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడం విశేషం. ఎన్నికల కంటే ముందు మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీలు వేరైనా, సిద్దాంతాలు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఉమ్మడి శత్రువు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు ఓటు వేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.
ఆ మేరకు శుక్రవారం శ్రీనివాస్ గౌడ్ ఓటు వేసినట్లు స్పష్టమైంది. గుబ్సి లోని జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్. ఆర్. శ్రీనివాస్(JDS MLA Goud) తన ఓటును చెల్లుబాటు చేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ను డిపాజిట్ చేశారన్న ఆరోపణలను ఖండించారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య నువ్వా నేనా అన్న పోట నెలకొంది. ఈ తరుణంలో క్రాస్ ఓటింగ్ ముఖ్యంగా మారింది. ఈ
రెండూ బీజేపీని ఓడించాలని శపథం చేశాయి.
కోలారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తుండగా ఎవరికి ఓటు వేశారని ప్రశ్నించింది మీడియా. ఆయన తడబడకుండా ఉన్న వాస్తవాన్ని చెప్పేశారు.
తాను కాంగ్రెస్ కు ఓటు వేశానంటూ చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో హెచ్ డి కుమార స్వామి నేతృత్వంలోని జేడీ – ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు కూడా.
కాగా మరో ఎమ్మెల్యే రవన్న తన బ్యాలెట్ పేపర్ ను బాక్సులో వేసే ముందు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు చూపించాల్సి వచ్చిందని ఆరోపించారు.
Also Read : ప్రవక్త వ్యాఖ్యలపై భారీ నిరసన