Prophet Comments : ప్రవక్త వ్యాఖ్యలపై భారీ నిరసన
దేశంలోని పలు చోట్ల ఆందోళన
Prophet Comments : మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలను(Prophet Comments) నిరసిస్తూ దేంలోని పలు చోట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత మసీదులలో ఆందోళన నిర్వహించారు.
ఢిల్లీలోని జామా మసీదు వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ , ఉత్తర ప్రదేశ్ నగరాలతో పాటు దేశంలోని పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి.
ప్రవక్తపై(Prophet Comments) కామెంట్స్ చేసిన బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ్ ను అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తాము నిరసనకు పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహీ ఇమామ్ వెల్లడించారు.
దీన్ని ఎవరు ప్రారంభించారో తెలియదన్నారు. పెద్ద సంఖ్యలో గుమి గూడిన వారందరినీ పోలీసులు చెదరగొట్టారు. ఇక ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ , మొరాదాబాద్ , ప్రయాగ్ రాజ్ , ఇతర నగారల్లో దుకాణాలు మూసి వేశారు.
ఒక ప్రాంతంలో నిరసనకారులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని లక్నో, కాన్పూర్ , ఫిరోజాబాద్ లలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కోల్ కతా లోని పార్క్ సర్కస్ ప్రాంతం, హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో, లూథియానా, అహ్మదాబాద్, నవీ ముంబై , శ్రీనగర్ లోని అనేక ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.
జార్ఖండ్ రాజధాని రాంచీలో దేవాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా అటు హిందూ , ఇటు ముస్లిం వర్గాలకు చెందిన నేతలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు జర్నలిస్ట్ సబా నఖ్వీపై కూడా కేసు నమోదు చేయడం విశేషం.
Also Read : విధ్వంసకర విధానాలు ఒప్పుకోం