Satyendar Jain Viral : నెట్టింట్లో ఆరోగ్య మంత్రి ఫోటో వైరల్
కావాలని టార్గెట్ చేశారంటూ సీఎం ఫైర్
Satyendar Jain Viral : మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఫోటో వైరల్(Satyendar Jain Viral) గా మారింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయన గురించి చర్చ జరుగుతోంది.
కావాలని ఆరోగ్య మంత్రిని టార్గెట్ చేశారంటూ ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నకిలీ ఆరోపణలు చేస్తూ, కేంద్ర దర్యాప్తు సంస్థలతో అబద్దపు కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా పోస్ట్ చేసిన సత్యేంద్ర జైన్ ఫోటో లో ఆయన ముఖంపై రక్తం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపైనే నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకులు. ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
ఫోటో వైరల్ కావడంతో శుక్రవారం ఈడీ ఆరోగ్య మంత్రిని ఆస్పత్రికి తరలించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. జైన్ నోటి దగ్గర గాయం ఉందనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. సత్యేంద్ర జైన్(Satyendar Jain Viral) ఈడీ కస్టడీలో ఉన్నారు.
మాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు. ఈ విషయంపై తాను ఏమీ చెప్పలేనని , దానిపై ఎక్కువగా వ్యాఖ్యానించ దల్చుకోలేదని సీఎం స్పష్టం చేశారు. నిన్న అతన్ని ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
ఏమి జరిగినా కొంచెం మెరుగ్గా ఉన్నప్పుడు మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు సీఎం. ఢిల్లీలో మొహల్లా క్లినిక్ లు ప్రవేశ పెట్టి పేదలు, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించిన ఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితి ఇలా ఉందని పేర్కొన్నారు.
నిజాయితీతో ప్రజలకు సేవలు అందించిన జైన్ ను ఇబ్బంది పెట్టిన బీజేపీకి దేవుడు గుణపాఠం చెబుతాడంటూ ఆప్ సభ్యుడు వికాస్ యోగి పేర్కొన్నాడు.
ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ ఫోటో ప్రధాని మోదీకి, ఈడీకి తీరని మచ్చగా మిగిలి పోతుందని , దేశం క్షమించదని ట్వీట్ చేశారు.
Also Read : ఢిల్లీ పోలీసులపై ఓవైసీ ఫైర్
ये वो शख़्स है जिसने देश को मोहल्ला क्लिनिक का मॉडल दिया 5 Flyover के निर्माण में दिल्ली की जनता का 300 करोड़ रु बचाया।@SatyendarJain की ये तस्वीर मोदी और उनकी मैना (ED) पर काला दाग है।
ये देश तुम लोगों को कभी माफ़ नही करेगा। pic.twitter.com/ejO4KcLLFb— Sanjay Singh AAP (@SanjayAzadSln) June 10, 2022