TS Schools Open : 13 నుంచే బడులు ప్రారంభం
జూలై 1 నుంచి రెగ్యులర్ పాఠాలు
TS Schools Open : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 13 నుంచే అన్ని బడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది.
ఆయా పాఠశాలలు, గురుకులాలు, ఇతర విద్యాలయాలకు అవసరమైన పుస్తకాలు, నోటు బుక్స్ , ఇతర మెటీరియల్ ను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి రెగ్యులర్ పాఠాలు కొనసాగుతాయని వెల్లడించింది. కరోనా కారణంగా ఈసారి సెలవులు తక్కువగా ఇచ్చారు.
కొత్త సంవత్సరం ప్రారంభం (TS Schools Open)పై పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది విద్యా శాఖ. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 13 నుంచి 30 వరకు బ్రిడ్జి కోర్సు చేపట్టాలని స్పష్టం చేసింది.
ఇందులో డిజిటల్ పాఠ్యాంశాలు, ముఖాముఖి క్లాసులు చేపడతారు. కాగా ఈ పాఠాల నుంచి 1, 2 తరగతులను తప్పించారు. 3 నుంచి 10వ తరగతి దాకా నాలుగు స్థాయిలుగా విభజించారు.
రోజుకు 6 పీరియడ్స్ బోధించాల్సి ఉంటుంది. గతంలో చదివిన పాఠాల్లోని ముఖ్యమైన అంశాలు ఇందులో చెబుతారు. ఇక ఆయా తరగతుల వారీగా ఏయే పాఠ్యాంశాలు బోధించాలనే దాని గురించి ఇప్పటికే షెడ్యూల్ ను విడుదల చేసింది విద్యా శాఖ.
టీ శాట్ విద్యా చానల్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇక రెగ్యులర్(TS Schools Open) గా వచ్చే నెల 1 నుంచి తరగతుల్లోనే పాఠాలు టీచర్లు విద్యార్థులకు చెప్పనున్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. తప్పి పోయిన విద్యార్థులను పాస్ అయ్యేలా తర్ఫీదు ఇస్తున్నారు. అక్కడ నాడు నేడు కార్యక్రమం సక్సెస్ అయ్యింది.
Also Read : 1,433 పోస్టులకు ఆర్థిక శాఖ క్లియర్