Rajya Sabha Results : బీజేపీ హ‌వా విప‌క్షాల‌కు షాక్

ప్ర‌తిపక్ష పార్టీల‌కు పెద్ద దెబ్బ

Rajya Sabha Results : దేశంలోని నాలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌లో(Rajya Sabha Results) భార‌తీయ జ‌న‌తా పార్టీ హ‌వా కొన‌సాగింది. మొత్తం 15 రాష్ట్రాల‌కు సంబంధించి 57 మంది ఎంపీల ప‌ద‌వీ కాలం పూర్త‌యింది. దీంతో 41 మంది ఏక‌గ్ర‌వంగా ఎన్నిక‌య్యారు.

దీంతో నాలుగు రాష్ట్రాల‌కు సంబంధించి 16 ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. హ‌ర్యానా, రాజ‌స్థాన్ , క‌ర్ణాట‌క‌, మహారాష్ట్రలలో జ‌రిగిన ఈ స్థానాల‌ను ఆయా పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

అతిర‌థ మ‌హార‌థులు బ‌రిలో నిలిచారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే జూలై నెల‌లో జ‌రిగే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వీరి ఓట్లు కూడా కీల‌కం కానున్నాయి.

మూడు స్థానాల‌లో బీజేపీ కైవ‌సం చేసుకుంది.

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల‌ను నిల‌బెట్టుకుంది. కానీ హ‌ర్యానాలో కాంగ్రెస్ కు, మ‌హారాష్ట్ర‌లో అధికార కూట‌మికి గ‌ట్టి దెబ్బ తగిలింది.

ఇదిలా ఉండ‌గా మూడు రాష్ట్రాల‌లో క్రాస్ ఓటింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

మ‌రాఠాలో శివ‌సేన‌, శ‌ర‌ద్ ప‌వార్ ఎన్సీపీ, కాంగ్రెస్ అధికార కూట‌మికి షాక్ త‌గిలింది. బీజేపీ త‌న మూడో సీటును(Rajya Sabha Results) గెలుచుకుంది. ఇక్క‌డ 6 సీట్లు

ఉండ‌గా 3 సీట్లు బీజేపీకి ద‌క్క‌గా 3 సీట్లు మహా వికాస్ అఘాడీకి ద‌క్కాయి.

హ‌ర్యానాలో కాంగ్రెస్ కు దెబ్బ త‌గిలింది. రెండు సీట్ల‌లో ఒక‌టి బీజేపీ చేజిక్కించు కోగా మ‌రోటి మీడియా బార‌న్ కార్తికేయ శ‌ర్మ గెలుపొందారు. ఇక్క‌డ కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇచ్చిన అజ‌య్ మాక‌న్ ఓట‌మి చెందారు.

రాజ‌స్థాన్ లో బీజేపీ స‌భ్యుల క్రాస్ ఓటింగ్ తో 4 స్థానాల‌కు గాను 3 సీట్లు కాంగ్రెస్ ద‌క్కించు కోగా ఒక‌టి బీజేపీ గెలుచుకుంది. బీజేపీ మ‌ద్ద‌తుతో బ‌రిలో

ఉన్న జీ మీడియా చైర్మ‌న్ సుభాష్ చంద్ర కు షాక్ త‌గిలింది.

క‌ర్ణాట‌క‌లో బీజేపీకి మూడు సీట్లు ద‌క్కగా కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు ల‌భించింది. హెచ్ డి కుమార స్వామికి బిగ్ షాక్ త‌గిలింది. వారు త‌మ స్థానాన్ని కోల్పోయారు. ఇక్క‌డ బీజేపీకి చెందిన నిర్మ‌లా సీతారామ‌న్ , జ‌గ్గేష్ , లెహ‌ర్ సింగ్ సిరియా గెలుపొందారు.

మిగిలిన ఒక సీటులో జైరాం ర‌మేష్ విజ‌యం సాధించారు. ఇక మొత్తం 57 స్థానాల‌కు గాను యూపీలో 11, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడులో 6 చొప్పున‌,

బీహార్ లో 5 సీట్లు పూర్త‌య్యాయి.

క‌ర్ణాట‌క‌, రాజ‌స్తాన్, ఏపీలో 4 సీట్ల చొప్పున గెలుపొందారు. మ‌ధ్య ప్ర‌దేశ్ , ఒడిశా లో 3 సీట్ల చొప్పున‌, పంజాబ్ , జార్ఖండ్ , హ‌ర్యానా, ఛ‌త్తీస్ గ‌ఢ్ ,

తెలంగాణ రాష్ట్రాల‌లో 2 సీట్ల చొప్పున , ఉత్త‌రాఖండ్ నుంచి ఒక సీటు చొప్పున ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

 

Also Read : నెట్టింట్లో ఆరోగ్య మంత్రి ఫోటో వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!