BJP Suspended MLA : కాంగ్రెస్ కు ఓటు బీజేపీ ఎమ్మెల్యేపై వేటు

దోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణికి పార్టీ షాక్

BJP Suspended MLA : రాజ‌స్థాన్ రాష్ట్రంలో జ‌రిగిన రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా బ‌రిలో నిలిచింది.

అయితే ఊహించ‌ని రీతిలో భార‌తీయ మీడియా మొఘ‌ల్ గా ప్ర‌సిద్ది చెందిన జీ గ్రూప్ సంస్థ‌ల అధినేత సుభాష్ చంద్ర‌ను రంగంలోకి దిపింది.

చివ‌రి దాకా ఆయ‌న గ‌ట్టి పోటీ ఇచ్చారు. కానీ ఏ పార్టీ అయితే మ‌ద్ద‌తు ఇస్తాన‌ని తెలిపిందో ఆ పార్టీకి చెందిన ధోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా ఝ‌లక్ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెలిపింది. క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డింది. త‌న ఓటు ప్ర‌త్య‌ర్థి పార్టీకి వేసింది. దీంతో ఇక్క‌డ మొత్తం నాలుగు రాజ్య‌స‌భ ఎంపీ స్థానాల‌కు గాను 3 స్థానాల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తే ఒక సీటులో బీజేపీ క్యాండిడేట్ గెలుపొందారు.

కానీ క్రాస్ ఓటింగ్ కార‌ణంగా ఇండిపెండెంట్ గా బీజేపీ స‌పోర్ట్ తో నిలిచిన సుభాష్ చంద్ర‌కు షాక్ త‌గిలింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ హై క‌మాండ్ దీనిని సీరియ‌స్ గా తీసుకుంది.

పార్టీ రూల్స్ కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థికి ఓటు వేసినందుకు గాను ఎమ్మెల్యేను సస్పెండ్(BJP Suspended MLA) చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సంజాయిషీ నోటీసు కూడా ఇచ్చింది.

త‌న‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడ‌దో వారం రోజుల్లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంది ఆ నోటీసులో. విచిత్రం ఏమిటంటే స‌ద‌రు ఎమ్మెల్యే ఇలా క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డ‌డం ఇదే మొద‌టిసారి కాదు గ‌తంలో కూడా ఇలాగే ఓటు వేసింది.

పొర‌పాటు జ‌రిగింద‌ని బ‌య‌ట ప‌డింది. 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డింది.

Also Read : శివ‌సేన ప‌త‌నం ప్రారంభం – ఫ‌డ్న‌విస్

Leave A Reply

Your Email Id will not be published!