President Election : రాష్ట్రపతి ఎన్నికపై ఎడతెగని ఉత్కంఠ
తగినంత బలం లేని ఎన్డీయేకు సవాల్
President Election : భారత దేశంలో అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి(President Election) పదవీ కాలం ముగియనుంది. రామ్ నాథ్ కోవింద్ తర్వాత ఎవరు బరిలోకి దిగుతారనే దాని కన్నా ఎలా గెలవాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ (ఎన్డీఏ) సర్కార్.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, ఎలా గెలిపించు కోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. విజయం సాధించేందుకు కావాల్సిన బలం లేక పోవడం అతి పెద్ద మైనస్ గా మారింది.
మరో వైపు విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాలని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ సూచించడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.
మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలతో ఈ మధ్య దూరం పెరగడం కొంత ఇబ్బందికరంగా మారింది.
మిత్రపక్షాలు సపోర్ట్ ఇస్తాయన్న నమ్మకం కలగడం లేదు. సంప్రదింపులు ప్రారంభించింది. నయానో భయానో ఏదో రకంగా తమకు అనుకూలమైన, తాము ఎంపిక చేసిన అభ్యర్థి ప్రెసిడెంట్ గా ఉంటే బావుంటుందని అనుకుంటోంది బీజేపీ సంకీర్ణ సర్కార్.
దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో బీజేపీకి మంచి బలం ఉంది. కానీ గెలుపు సాధించేందుకు అవసరమైన బలం మాత్రం లేదు. 40, 756 ఓట్ల దూరంలో ఉండడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
4,809 మంది ఓటర్లు ఉండగా 776 మంది ఎంపీలు కలిపి ఓటు విలువ 5,43,200. 4,033 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 5,43,231 గా ఉంది. మొత్తం ఓట్ల వాల్యూ 10, 86, 431గా ఉంది.
బీజేపీ ఎన్డీయేకు 5,35,000 ఓట్లు ఉండగా మిగిలిన విపక్షాలకు 5,51,431 ఓట్లు ఉన్నాయి. ఇక రాష్ట్రపతి(President Election) గా గెలవాలంటే 5,43,217 ఓట్లు అవసరం అవుతాయి. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 8,217 ఓట్లు కావాల్సి ఉంటుంది.
Also Read : కాంగ్రెస్ కు ఓటు బీజేపీ ఎమ్మెల్యేపై వేటు