Mamata Banerjee : బీజేపీ నిర్వాకం ప్రజలకు శాపం – దీదీ
కాషాయ శ్రేణుల వల్లే ఈ అల్లర్లు
Mamata Banerjee : భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థల నేతల నిర్వాకం, బాధ్యతా రాహిత్యం వల్ల ఇవాళ దేశం పరువుకు భంగం వాటిల్లుతోందంటూ నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee).
ఆ పార్టీకి చెందిన నాయకురాలు నూపుర్ శర్మ్ , నవీన్ జిందాల్ కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ప్రపంచ వ్యాప్తంగా 51 ముస్లిం దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
శుక్రవారం దేశంలోని ఉత్తర ప్రదేశ్ , ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, తదితర నగరాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అయ్యారు.
ఇవాళ ఢిల్లీ పోలీసులు జామా మసీదు వెలుపల నినాదాలు చేసిన వారిపై కేసు నమోదు చేశారు. తాజాగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ లో నిరసనలు మిన్నంటాయి.
శనివారం కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో మనుషుల మధ్య విభేదాలను సృష్టించడం ఒక అలవాటుగా మారిందంటూ నిప్పులు చెరిగారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
వీటిని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ శక్తులు రాజకీయం చేయాలని అనుకుంటున్నామని ఆరోపించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో హింసను సహించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు మమతా బెనర్జీ.
సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టిస్తామని సీఎం హెచ్చరించారు. బీజేపీ చేసిన పాపాలకు ప్రజలు ఎందుకు బాధ పడాలని ఆమె ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ప్రధాని కానీ, హోం మంత్రి కానీ నోరు విప్పిన పాపాన పోలేదన్నారు దీదీ. బీజేపీపై నిప్పులు చెరుగుతూ ఇవాళ మమతా బెనర్జీ ట్వీట్ చేయడం కలకలం రేపింది.
Also Read : రాజ్యసభ రిజల్ట్స్ పట్టించుకోం