Taslima Nasreen : తస్లీమా నస్రీన్ షాకింగ్ కామెంట్స్
మతోన్మాదుల పిచ్చిని చూసి షాకయ్యా
Taslima Nasreen : బంగ్లాదేశ్ కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్(Taslima Nasreen) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. మహ్మద్ ప్రవక్త పై అనుచిత కామెంట్స్ చేశారంటూ నిరసనలు, ఆందోళనలు కొనసాగతుండడంపై తస్లీమా స్పందించారు.
ఇస్లాంకు చెందిన ఛాందసవాదులు ఆమెపై మండిపడ్డారు. చంపుతామంటూ బెదిరించారు. చివరకు నస్రీన్ ఆ దేశాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది. తస్లీమాకు ఇస్లాం వ్యతిరేక అభిప్రాయాలు, భావాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ఆమె మహ్మద్ ప్రవక్త ఇవాళ జీవించి ఉంటే అని పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మతోన్మాదుల పిచ్చిన చూసి తాను షాక్ కు గురయ్యానంటూ వ్యాఖ్యానించింది తస్లీమా నస్రీన్.
ఇదిలా ఉండగా తన పుస్తకం లజ్జా బంగ్లాదేశ్ లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. మూడు దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడుపుతున్నారు. 59 ఏళ్ల తస్లీమా నస్రీన్ 1994లో తన దేశాన్ని విడిచి పెట్టింది.
ఆమెను చాందసవాదులు, సంస్థలు బెదిరింపులకు గురి చేశాయి. కాగా తస్లీమా స్వీడిష్ పౌరసత్వం కలిగి ఉన్నా గత 20 ఏళ్లుగా యుఎస్ , యూరప్ లో ఉంటున్నారు.
చాలా వరకు తాత్కాలిక నివాసం పర్మిట్ తో భారత దేశంలోనే ఉన్నారు. ఈ దేశంలో శాశ్వతంగా నివసించాలనే కోరికను సైతం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా టీవీ చర్చలో భాగంగా జర్నలిస్ట్ సబా నఖ్వీ అడిగిన ప్రశ్నకు నూపుర్ శర్మ ప్రవక్తపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దానిని సపోర్ట్ చేశారు మరో బీజేపీ నేత నవీజ్ జిందాల్. ఆమె చేసిన కామెంట్స్ దేశంలో అల్లర్లకు కారణమైంది.
Also Read : గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్
No one is above criticism, no human, no saint, no messiah, no prophet, no god. Critical scrutiny is necessary to make the world a better place.
— taslima nasreen (@taslimanasreen) June 8, 2022