Manickam Tagore : ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ నిరసన
సోనియా, రాహుల్ కు నోటీసులు ఇవ్వడంపై
Manickam Tagore : నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి. ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో పాటు అగ్ర నేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది.
కాగా సోనియాకు కరోనా పాజిటివ్ రావడంతో తాను రెస్ట్ తీసుకోవాల్సి ఉందని హాజరు కాలేనంటూ స్పష్టం చేసింది. దీనిని ఈడీ కూడా ద్రువీకరించింది.
కాగా ఈడీ సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాణికం ఠాగూర్(Manickam Tagore) వెల్లడించారు.
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన రాహుల్ గాంధీ పంజాబ్ లో ఇటీవలే దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ సింగర్ సిద్దూ మూసే వాలా కుటుంబాన్ని పరామర్శించారు.
ఈనెల 13న సోమవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. ఎప్పుడో ఈ కేసును మూసి వేసినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కావాలని తిరిగి ఓపెన్ చేసిందంటూ ఆరోపించారు ఠాగూర్(Manickam Tagore).
దేశంలోని ఈడీకి చెందిన 25 ఆఫీసుల ఎదుట ఆందోళన కొనసాగుతుందన్నారు. సోనియా, రాహుల్ గాంధీని నకిలీ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు .
మోదీ, అమిత్ షా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈనెల 23న సోనియా గాంధీ విచారణకు హాజరవుతారని తెలిపారు.
Also Read : ఏకమవుదాం ఎన్డీఏ అభ్యర్థిని ఓడిద్దాం