PM Sri Lanka : రష్యాతో ఆయిల్ కొనుగోలుకు సిద్దం – పీఎం
శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే
PM Sri Lanka : శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే సంచలన కామెంట్స్ చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం సమయంలో ఆయన పీఎంగా కొలువు తీరారు. దేశంలో నెలకొన్న అస్థిరతను తొలగించేందుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆయన మొదటగా సంతకం చేసిన వెంటనే భారత దేశానికి కితాబు ఇచ్చారు. కష్టాల్లో ఉన్న శ్రీలంకకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు ప్రకటించారు. ఇదే సమయంలో ఇతర దేశాలతో తరుచుగా మాట్లాడుతున్నారు.
ఎలాగైనా సరే శ్రీలంకను గట్టెక్కించే ప్రయత్నాలు చేయడంలో తలమునకలై ఉన్నారు రణిల్ విక్రమ సింఘే. ఇదిలా ఉండగా తాజాగా ప్రధాన మంత్రి(PM Sri Lanka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఆయిల్, నిత్యావసరాలు, గ్యాస్ లేక సంక్షోభం అంచున నిలబడి ఉంది శ్రీలంక(PM Sri Lanka). ముందు చమురు, గ్యాస్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు రణిలె. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం ఇంకా కొనసాతుండడంతో విపత్కర పరిస్థితి నెలకొంది.
ప్రధానంగా ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.
తీవ్ర సంక్షోభం నుంచి బయట పడాలంటే రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు విక్రమ సింఘే. అప్పులు పెరుగుతున్నప్పటికీ చైనా నుండి మరింత ఆర్థిక సాయం పొందేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
రష్యా కూడా శ్రీలంకకు గోధుమలు అందించిందని చెప్పారు. ఇదిలా ఉండగా శ్రీలంకలో పౌరులు ఆహారం, ఇంధనం, ఔషధాలు వంటి ప్రాథమిక అవసరాల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.
Also Read : గ్రే జోన్ నుండి తొలగించండి – జెలెన్ స్కీ