Bulldozers UP : యూపీ అల్లర్లలో 300 మంది అరెస్ట్
నిరసనకారులపై సీఎం ఉక్కు పాదం
Bulldozers UP : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు, నిరసనకారులపై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం.
ఈ మేరకు ఎవరు ఉన్నా సరే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఇప్పటి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 300కి పైగా అరెస్ట్ చేశారు.
శుక్రవారం ప్రార్థనలు జరిగిన అనంతరం కొందరు పనిగట్టుకుని నిరసనలకు పాల్పడ్డారు. ఈ హింసాకాండ వెనుక ప్రధాన సూత్రధారులలో జావేద్ మహ్మద్ ఒకడని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూపీలోని సహరాన్ పూర్ లో ఇద్దరు నిందితుల ఇళ్లను కూల్చి వేశారు.
పోలీసుల సమక్షంలో బుల్డోజర్లు(Bulldozers UP) ఆదివారం ప్రయాగ్ రాజ్ లో కూల్చివేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడి ఇంటిని కూల్చి వేశారు.
ఆ ఇంటికి సంబంధించిన గేట్లు, బయటి గోడలను ధ్వంసం చేశారు. మొత్తం హింసాకాండ వెనుక సూత్రధారులలో ఒకడని పోలీసులు వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ ప్రాంతాలలో భారీ ఎత్తున రాళ్లు రువ్వారు.
తిరిగి పూర్వ స్థితిని తీసుకు వచ్చేందుకు పోలీసులకు 5 గంటలకు పైగా సమయం పట్టింది. కొన్ని గృహోపకరణాలను మున్సిపల్ సిబ్బంది బయటకు తీసుకు వచ్చి రోడ్డుపైకి తీసుకు వచ్చారు.
కూల్చి వేత ఆర్డర్ కు సమాధానం ఇవ్వడంలో జావేద్ విఫలమయయాడని నోటీసులో పేర్కొంది. సహరాన్ పూర్ లో ఇద్దరు నిందితుల ఇళ్లను కూల్చి వేశారు. కాన్పూర్ లో కూడా అల్లర్లు చోటు చేసుకున్నాయి.
ఇక అరెస్ట్ అయిన వారిలో ప్రయాగ్ రాజ్ లో 91 మందిని, సహరాన్ పూర్ లో 71 మంది, హత్రాస్ లో 51 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : యూపీలో నిరసనకారులపై ఉక్కుపాదం