Suvendu Adhikari : పోలీసుల తీరుపై సువేందు సీరియ‌స్

హౌరాకు వెళుతుంటే అడ్డుకున్నార‌ని ఫైర్

Suvendu Adhikari : ప‌శ్చిమ బెంగాల్ లోని హౌరాలో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లాల‌ని అనుకున్న త‌న‌ను పోలీసులు కావాల‌ని అడ్డుకున్నారంటూ బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు.

పుర్బా మేదినీపూర్ జిల్లాలోని త‌మ్లుక్ ప్రాంతంలో అడ్డుకున్నార‌ని మండిప‌డ్డారు. హౌరాలో 144 సెక్ష‌న్ విధించారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా అడ్డుకోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

సువేందు అధికారి ఆదివారం త‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. హౌరా జిల్లాలో ప‌ర్య‌టించ‌డం వ‌ల్ల శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

పోలీసుల తీరు దారుణ‌మ‌ని పేర్కొన్నారు. తామ్లుక్ ప‌రిధిలోని రాధ‌మోని వ‌ద్ద ఎన్ హెచ్ 116లో త‌న‌ను చ‌ట్ట విరుద్దంగా అడ్డుకున్నారంటూ ఆరోపించారు సువేందు అధికారి.

పుర్బా మేదినీపూర్ జిల్లాలో క‌ర్ఫ్యూ లేదా సెక్ష‌న్ 144 విధించారా అని ప్ర‌శ్నించారు. కోలా ఘాట్ వెళ్లాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా త‌న‌కు సంద‌ర్శించే హ‌క్కు లేదా అని సువేందు అధికారి(Suvendu Adhikari) నిల‌దీశారు.

బెంగాల్ లో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అల్ల‌ర్లు, విధ్వంసం, దోపిడీలు పెరిగి పోయాయ‌ని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా సువేందు అధికారి, పోలీసుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. హౌరాను సంద‌ర్శించే ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు సువేందు.

తన‌ను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని నిర‌సిస్తూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. చివ‌రికు టియ‌ర్ గ్యాస్ షెల్స్ ప్ర‌యోగించాల్సి ఉంది.

Also Read : ఈడీని అప్ప‌గిస్తే ఫ‌డ్న‌విస్ ఓటు మాకే

Leave A Reply

Your Email Id will not be published!