Congress March : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళ‌న

ఈడీ తీరు దారుణ‌మంటూ నిర‌స‌న

Congress March : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీకి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ స‌మ‌న్లు పంపించ‌డాన్ని నిర‌సిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్(Congress March) ఆందోళ‌న చేప‌ట్టింది.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఈడీ కార్యాల‌యాల ఎదుట నిర‌స‌న‌లు చేప‌ట్టింది. పెద్ద ఎత్తున పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, బాధ్యులు, ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

కేంద్ర స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించారంటూ ఆరోపించారు. దేశ రాజ‌ధానిలో భారీ ఎత్తున నిర‌స‌న తెల‌ప‌డంతో ప‌రిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

కావాల‌ని సోనియా, రాహుల్ ను ఇరికించేందుకే ఇలా చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. బీజేపీయేత‌ర పార్టీలు, సంస్థ‌లు, వ్య‌క్తుల‌ను టార్గెట్ గా పెట్టుకుని వేధింపుల‌కు గురి చేస్తూ అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ పార్టీ భారీ మార్చ్ చేప‌ట్టింది. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ప‌లువురు నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

దీంతో దేశ వ్యాప్తంగా కొంత ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. మ‌రో వైపు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సోనియా, రాహుల్ గాంధీపై. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు తిర‌గ దోడాల‌ని ఆయ‌న కోరారు.

Also Read : ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!